పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి దోస్తులు గా ఉండేవారు కానీ గతంలో ఏవో కొన్ని కారణాల వలన వారి మధ్య దూరం పెరిగింది. తదనంతరం వాళ్ళిద్దరు మంచి స్నేహితులుగానే ఉన్నారని కొన్ని సందర్భాలలో నిరూపితమయింది. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి మూవీ తెరకెక్కింది కానీ ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఈ సినిమా వీళ్లిద్దరి సినీ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి సినిమా మంచిగా లేకపోవడంతో ప్రేక్షకులు అందరూ తీవ్ర నిరాశ చెందారు. ఈ సినిమాను ఇతర సినిమా నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టాడని తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు అతడిపై ఇంకా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 


పవన్ చరిత్రలో మరిచిపోలేనటువంటి డిజాస్టర్ సినిమా ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అతనితో మళ్ళీ ఇంకొక సినిమా తీసి సూపర్ హిట్ ఇవ్వాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడ కనిపించినా పవన్ అభిమానులు వెంటనే సార్ పవన్ తో సినిమా ఎప్పుడు తీస్తున్నారంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని ఏ సందర్భంలోనూ చెప్పడంలేదు.


దీంతో పవన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మూడు స్క్రిప్టులను లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పట్లో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రాదని తెలుస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మాట చెబితే అభిమానులు శాంతిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: