మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 4 కి సన్నద్ధం అవుతుంది. ఇంతకీ ఈ సీజన్ హోస్ట్ గా ఎవరు చేస్తారన్న  విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నా.. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లీకులను బట్టి చూస్తే ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జునే చేస్తారని చెబుతున్నారు. సీజన్ 1 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా.. సీజన్ 2ని నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. ఇక మూడవ సీజన్ లో సీనియర్ స్టార్ నాగార్జున హోస్ట్ గా చేసి దుమ్ముదులిపేశాడు. 

 

నాల్గవ సీజన్ లో అసలైతే మళ్లీ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను తీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు. కాని అది కుదరలేదు. అంతేకాదు ప్రస్తుతం చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకే తారక్ పోర్షన్ చాలా పెండింగ్ పడ్డది. అందుకే ముంగు బిగ్ బాస్ సీజన్ 4 చేయాలని అనుకున్నా కూడా ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఇక ఆయన తప్ప మరే కొత్త హోస్ట్ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తుంది. అందుకే మళ్లీ నాగార్జుననే హోస్ట్ గా తీసుకుంటున్నారట.

 

కరోనా వల్ల బిగ్ బాస్ కంటెస్టంట్స్ విషయంలో కూడా పెద్ద కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. అందుకే ఈసారి కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే స్టార్ సెలబ్రిటీస్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఈసారి టాస్కులు కూడా కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 4 నాగార్జున హోస్ట్ గా చేయడం ఎంతవరకు వాస్తవం.. దానికి సంబందించిన విషయాలు తెలియాల్సి ఉంది.               

 

మరింత సమాచారం తెలుసుకోండి: