టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్, ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయం అవడం జరిగింది. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో పాటు దర్శకుడిగా ఫస్ట్ సినిమా తోనే పూరి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగిన పూరి, ఆపై ఒకానొక సమయంలో మహేష్ తో తీసిన పోకిరి సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో సూపర్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు. ఇక అక్కడి నుండి ఆయనకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అయితే అనంతరం మధ్యలో కొన్ని హిట్స్ అందుకున్న పూరి, ఇటీవల కొన్నేళ్లకుగా సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా కొంత సమస్యలు ఎదుర్కొన్నారు. 

IHG

ఎట్టకేలకు ఇటీవల రామ్ హీరోగా ఆయన తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఎన్నో ఏళ్ల గ్యాప్ అనంతరం పూరి కి మళ్ళి మంచి హిట్ లభించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా తీస్తున్న పూరి, దీని అనంతరం తన డ్రీమ్ ప్రాజక్ట్ జనగణమణ సినిమాని తీయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి కోనేళ్ళుగా పూరి ఈ ప్రాజక్ట్ పై ఎంతో బాగా వర్క్ చేసి పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేయడం జరిగింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా చేస్తారని, పూరి మార్క్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఆయనకు బాగా నప్పుతాయని అందరూ భావించారు. కాగా నేడు ఈ సినిమా విషయమై పూరి ఒక పోస్ట్ పెడుతూ, తన డ్రీమ్ ప్రాజక్ట్ జనగణమణ తప్పకుండా అతి త్వరలో తీస్తా అని చెప్పడంతో, ఆయన ఎవరితో ఆ సినిమా తీస్తారా అనే ఆలోచన అందరిలో మొదలైంది. 

IHG

కాగా అందరూ భావిస్తున్నట్లు ఈ సినిమాని మహేష్ బాబు తో కాకుండా నందమూరి నటసింహం బాలకృష్ణతో పూరి తీయనున్నట్లు లేటెస్ట్ న్యూస్. గతంలో కొంత పరోక్షముగా మహేష్ పై కామెంట్స్ చేసిన పూరి, కావాలనే ఆయనకు హ్యాండ్ ఇచ్చి, బాలయ్యకు బ్యాండ్ బజాయించనున్నారని కొంత వాదన వినపడుతోంది. అయితే వాస్తవానికి మహేష్ తో ఈ సినిమా చేయకపోవడానికి కారణం, రాబోయే రోజుల్లో మహేష్ వరుస ప్రాజక్ట్స్ తో బిజీగా ఉండడంతో పూరి, బాలయ్యను ఎంచుకున్నట్లు కొందరు అంటున్నారు. అదీకాక గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పైసా వసూల్ సినిమా సమయంలో బాలయ్యకు, పూరికి మధ్య మంచి అనుబంధం ఏర్పడిన కారణంగా, అలానే ఈ సినిమా కథ తనకు ఎంతో నచ్చడంతో బాలయ్య కూడా చేయడానికి పచ్చ జండా ఊపారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: