ఇప్పుడు దేశంలో సినిమాలు విడుదల అయ్యే అవకాశం దాదాపుగా కనపడటం లేదు. దేశ వ్యాప్తంగా సినిమాలను విడుదల చేయడానికి గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు స్టార్ హీరోలు దర్శకులు. ప్రస్తుతం మన తెలుగు లో అయితే సినిమాలను విడుదల చేయడానికి గానూ కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు గాని ఇప్పుడు ఉన్న పరిస్థితి లో సినిమాలను విడుదల చేయడం దాదాపుగా కష్టం అనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

 

అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలను విడుదల చేయడానికి గానూ ఒక వ్యూహం అమలు చెయ్యాలి అని భావిస్తున్నారు అని తెలుస్తుంది. సినిమాలను  విడుదల చేయడానికి గానూ కరోనా కేసులు  లేని జిల్లాలను ఎంచుకోవాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముందు తొలి దశగా ఒక జిల్లాను ఎంచుకుని ఆ జిల్లాలో కనీసం ఒక 10 హాల్స్ లో విడుదల చెయ్యాలి అని ఒక సినిమాను ముందు విడుదల చేసి మిగిలిన సినిమాలను పరిస్థితి ఆధారంగా విడుదల చెయ్యాలి అని పలువురు కోరుతున్నారు. 

 

ఇక అగ్ర హీరోల సినిమాలను ఈ విధంగా విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. అయితే ముందు చిన్న హీరోల సినిమాలను విడుదల చేసి ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాలను విడుదల చేయడం మంచిది అనే భావన లో ఇప్పుడు టాలీవుడ్ జనాలు ఉన్నారు అని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే సినిమాల విడుదల  ఎక్కువగా వాయిదా పడితే మాత్రం నష్టపోయే అవకాశం ఉందని అందుకే ఇప్పుడు హీరోలు నిర్మాతలు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: