టాలీవుడ్ లో చాలా తక్కువ కాలం లో స్టార్ హీరోయిన్ గా మారింది రష్మిక. ఆమె సినిమాలు ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా సరే చిన్న హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గకుండా తన స్థాయికి తగిన విధంగా ఆమె నటిస్తూ ఉంటారు. ఇక డాన్స్ విషయంలో కూడా ఆమె చాలానే కష్టపడుతుంది. మహేష్ బాబు తో పోటీ గా ఆమె సరిలేరు నీకెవ్వరు సినిమాలో డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటన కు కూడా మంచి పేరు వచ్చింది అనే సంగతి తెలిసిందే. 

 

ఇక ఈ సినిమాలో ఆమె చేసిన యాక్షన్ తో పాటుగా ఆమె హావ భావాలకు కూడా మంచి స్పందన వచ్చింది అనే చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె తెలుగు లో యాసలు నేర్చుకునే ఆలోచనలో ఉంది అని సమాచారం. ఆమె కృష్ణా జిల్లా అమ్మాయిఎన్టీఆర్ తో వస్తున్న సినిమాలో కనపడే అవకాశం ఉంది అని సమాచారం. అదే విధంగా అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో కూడా ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె చిత్తూరు అమ్మాయి గా కనపడే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్. 

 

ఇక అందుకే ఆమె ఇప్పుడు తెలుగు నేర్చుకోవడం తో పాటుగా యాస లను కూడా నేర్చుకుంటుంది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఆమెకు మంచి క్రేజ్ ఉంది మన తెలుగు లో దానిని బాగానే వాడుకునే ఆలోచనలో ఉంది ఈ కన్నడ పాప. మరి ఆమె ఏ విధంగా తెలుగు నేర్చుకుంటుంది అనేది చూడాలి. పుష్ప సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా అపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: