బాలీవుడ్ యాంగ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే టీవీ యాక్టర్ నుండి సినిమా హీరో వరకు ప్రయాణం చేసి అభిమానులలో తనకంటూ మంచి గుర్తింపు సాధించాడు. తనకు వచ్చిన అవకాశాలతోనే తనను తాను నిరూపించుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ లో ని నేపోటిజం కరోనా తీవ్ర ఒత్తిడి, మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

IHG

 

అయితే సుశాంత్ పడిన మానసిక క్షోభకు బాలీవుడ్‌ని లోని నెపోటిజం కారణం అని సోషల్ మీడియాలో విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లోని నెపోటిజంపై ప్రముఖ నటి రేణు దేశాయ్ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. వారసత్వం ఉన్న వారు ఎదగం కోసం టాలెంట్ ఉన్న వాళ్లను తొక్కేయడం నెపోటిజం. 

 

IHG

 

ఈ నేపాటిజం కేవలం సినిమా వాళ్లలో మాత్రమే లేదు అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే పరిస్థితి బట్టి అది బయటకు వస్తు ఉంటుంది. అయితే టాలెంట్ నమ్ముకున్న వారికీ సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు అని ఉన్న వాళ్ళని ఇలాంటి నేపాటిజం ఎం చెయ్యలేవు.. టాలెంట్ ఉండాలి దానితో పాటు దైర్యం కూడా ఉండాలి.. ఏ సమస్యను అయినా ఎదుర్కొనే శక్తి ఉండాలి. 

 

IHG

 

ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయలేనప్పుడు డిప్రెషన్స్‌లోకి వెళ్తారు.. సుశాంత్ పరిస్థితి కూడా అదే. అయన చాలా టాలెంటెడ్ దాంతో పాటు సెన్సిటివ్ కూడా. ఇండస్ట్రీలో మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి మనకు టాలెంట్ తో పాటు మానసిక దైర్యం అంతే ముఖ్యం.. కేవలం ఫ్యామిలీ బ్యాగౌండ్ ఉంటే సరిపోదు.. అలానే టాలెంట్ ని మాత్రమే నమ్ముకొని ఇండస్ట్రీకి రాకూడదు అంటూ కామెంట్లు చేసారు. 

 

IHG

 

దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ''అతను ఒక సంవత్సరం కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్ళ నుండి అతను నరకం అనుభవించాడు.. మంచి పేరు వచ్చిన అతనికి అవకాశాలు వచ్చిన అవి లేకుండా వెనుక నుండి చేస్తున్నారు. ఎంత కష్టపడి ఎదగాలి అని చుసిన తోక్కేస్తున్నారు.. ఏ మనిషి అయినా ఎంత వరకు దైర్యం చెప్పుకోగలడు'' అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు స్పందిస్తూ.. ''మీ కొడుకు కూడా సినిమాల్లోకి వస్తాడు కదా.. అందుకే ఈ మాటలు'' అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: