నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే బిబి 3 రోరింగ్ అంటూ ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఒక పాత్రలో అఘోరాగా కనిపిస్తాడని అంటున్నారు. బాలయ్య బర్త్ డేకి పంచెకట్టుతో వచ్చిన టీజర్ అదిరిపోగా ఇక సినిమాలో అలాంటి డైలాగ్స్, యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయని చెబుతున్నారు.

 

ఇదిలాఉంటే ఈ సినిమాకు టైటిల్ గా మోనార్క్ అన్నది కొన్నాళ్లుగా మీడియాలో వినిపిస్తుంది. బోయపాటి శ్రీను కూడా ఆ టైటిల్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాడట. బాలయ్య ఆమోదం కోసం చూడగా ఫైనల్ గా బాలకృష్ణ కూడా మోనార్క్ టైటిల్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో బాలకృష్ణ నట విశ్వరూపం చూస్తారని అంటున్నారు. సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా టీజర్ తోనే సినిమాలో విషయం ఉన్నట్టుగా తెలియచేసింది. ఇక త్వరలోనే సినిమా నుండి మరో ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. 

 

సినిమా తర్వాత బాలకృష్ణ యువ దర్శకుడు అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమా కథ, కథనాలు ఇదివరకు బాలయ్య ఇమేజ్ కు భిన్నంగా ఉంటాయట. ఆ ప్రాజెక్ట్ కు సంబందించిన వార్తలు బయటకు రావాల్సి ఉంది. తప్పకుండా బాలకృష్ణ మాత్రం బిబి 3 తోనే కాదు ఆ తర్వాత సినిమాలతో కూడా దుమ్ముదులిపే ప్లాన్ వేశాడని అంటున్నారు. కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కు ఇది పండుగ చేసుకునే వార్త అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: