కరోనా ఎన్నిరకాలుగా కట్టడి చేసిన ఆగడం లేదు.. ఇంతకాలం ఈ వైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం అది కాస్త సడలించడంతో వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రమంతటా కరోనా వైరస్‌కు భయపడే వారు తగ్గిపోయారు.. అంతే కాదు సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు.. ఇందు వల్ల కరోనాను మరింత ఫ్రీగా ఆహ్వానించినట్లుగా అందరిని ఓ పట్టుపడుతుంది.. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా టీవీ, సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

 

అయితే షూటింగ్‌లు జరిపేటప్పుడు మాత్రం వైరస్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతో పాటుగా.. కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. వారి సూచనలకు తగ్గట్టుగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సీరియల్స్‌, టీవీ షోల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఇంత వరకు బాగానే ఉంది కానీ కరోనా అంత త్వరగా బయటపడదుగా ఇక సినిమా షూటింగ్‌లు అయితే మొదలవలేదు గానీ కొందరు సీరియల్స్ మాత్రం షూట్ చేస్తున్నారు.. ఈ నేపధ్యంలో ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే సీరియల్ నటుడు సెట్లో జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతు కనిపించడంతో వెంటనే ఇతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నిర్మాతలు ఆ సీరియల్‌ షూటింగ్‌ను నిలిపివేయడమే కాదు. ఆ యూనిట్ సభ్యులందరిని క్వారంటైన్‌కు పంపించినట్టుగా సమాచారం.

 

 

కాగా కరోనా సోకిన ఈ నటుడు.. మరో చానల్‌లో ప్రసారమయ్యే సీరియల్‌లో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇతను ప్రస్తుతం వరకు ఎంత మందితో కాంటాక్ట్ పెట్టుకున్నాడు, ఎవరితో కలిసి ఎక్కువగా మూవ్ అయ్యాడు అనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఇకపోతే ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ఎవరైనా గానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచింది.. లేదని మొండికేస్తే కరోనా కాటుకు గురవడం ఖాయం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: