డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా దర్శకదిగ్గం రాజమౌళి తీస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా కరోనా కారణంగా వాయిదా పడడం జరిగింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా ఈ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో చాలావరకు సినిమాల షూటింగ్స్ మొదలు కానే లేదు. ఇప్పటికే అక్కడక్కడా కొన్ని సినిమాలు షూటింగ్స్ ని మొదలెట్టినప్పటికీ, మెజారిటీ సినిమా యూనిట్స్ వారు మాత్రం ఈ మాయదారి మహమ్మారి కరోనా దెబ్బకు వెనకడుగువేస్తున్నారట. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే, ఈ సినిమాకు సంబంధించి అతి తక్కువమంది సభ్యులతో ముందుగా కొంత ట్రయిల్ షూట్ చేయాలని యూనిట్ భావించిందని, అయితే కొన్ని కారణాల వలన అది కూడా నిలిపివేయబడిందని అంటున్నారు. 

IHG

వాస్తవానికి ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమాకు సెట్టింగ్స్ కూడా భారీ రేంజ్ లోనే అవసరం అవుతాయి. అదీకాక పీరియాడికల్ మూవీ గా స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న కథ కావడం, అలానే కొందరు విదేశీ నటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో వారు తమ దేశాలు దాటి మన దేశానికి వచ్చే పరిస్థితి చాలావరకు కష్టం అని సమాచారం. అలానే మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ వేయడం జరిగిందని వార్తలు వచ్చినప్పటికీ, ఈ పరిస్థితుల్లో షూటింగ్ మొదలెడితే యూనిట్ వారు అనుకున్న మేరకే తక్కువ మందితో షూటింగ్ చేయడం కుదురుతుందా లేదా అనేది కూడా వారిని కొంత సందిగ్ధావస్థలో పడేసిందని అంటున్నారు. 

 

వీటన్నిటి కారణంగా అసలు అనుకున్న విధంగా రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే పరిస్థితు లేనట్లు ఇన్నర్ టాక్. ఈ విషయమై ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ, సినిమాని అనుకున్న తేదీనే రిలీజ్ చేస్తామా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం అని, మరికొన్నాళ్లు గడిచిన తరువాతనే చెప్పగలం అని అన్న విషయం తెలిసిందే. అలానే నిర్మాత దానయ్య కూడా ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ, అనుకున్న తేదీన సినిమా వస్తుందా లేదా అనేది తాను కూడా గట్టిగా చెప్పలేనని అన్నారు. మొత్తంగా చూస్తే కరోనా దెబ్బ మిగతా రంగాలతో పాటు సినిమా రంగం మీద కూడా బాగానే పడిందని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: