టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే తన కెరీర్ పరంగా తీసిన నాలుగు సినిమాలతో కూడా సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా మొదలెట్టిన కొరటాల, ఎలాగైనా ఆ సినిమాతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా ఎఫెక్ట్ అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సినిమా షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. 

IHG

దానితో ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనే సందిగ్ధావస్థలో అందరూ ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా విషయమై మాత్రం దర్శకుడు కొరటాల సహా యూనిట్ మొత్తం కూడా కొంత టెన్షన్ లో ఉన్నట్లు చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం, ఈ సినిమాలోని ముఖ్యమైన విద్యార్థి నాయకుడి పాత్రే అని తెలుస్తోంది. ముందుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని ఈ పాత్ర కోసం తీసుకోవాలని యూనిట్ భావించింది. అలానే ఇదే విషయాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించడం జరిగింది. అయితే అప్పటికి ఇంకా కరోనా అనేది మన ఇండియాలో ఎంటర్ అవ్వలేదు. అనంతరం కొద్ది కాలానికే కరోనా ఎఫెక్ట్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో ఆచార్య షూటింగ్ కూడా వాయిదా పడింది. అయితే ఇప్పటివరకు ఆ పాత్రకు చరణ్ నే తీసుకోవాలనే గట్టి ఆలోచనతో ఉన్నారట యూనిట్ సభ్యులు. 

 

ఇక ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ పరిస్థితే కొంత సందిగ్ధంలో పడడంతో ఆయనను గట్టిగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని కొరటాల మరొక నటుడిని ఆ పాత్ర కోసం తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఇటీవల ఒకానొక సందర్భంలో ఆచార్య లోని విద్యార్థి నాయకుడి పాత్ర విషయమై సూపర్ స్టార్ మహేష్ కు చెప్పడంతో, ఏమైనా సమస్య ఎదురైతే మీకు నేను ఉన్నాను అని హామీ ఇచ్చారని అన్నారు. కాగా ఒకవేళ చరణ్ స్థానంలో మహేష్ ను కూడా తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదని అంటున్నారు. ఎందుకంటే మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ ఆగష్టు అనంతరం ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని, అందుకని ఈలోపు ఆయన ఆచార్యలో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ సినిమాలోని ఆ కీలక పాత్రలో ఎవరు నటిస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: