బిగ్ బాస్ సీజన్ 3లో హాట్ పెయిర్ గా నిలిచిన జోడీ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి. ఓరకంగా రాహుల్ విన్నర్ అయ్యేందుకు పునర్నవి లవ్ ట్రాక్ కూడా ఓ కారణమని చెప్పొచ్చు. హౌజ్ లో వీళ్లు చేసిన రచ్చ మాములుగా కాదు. వీళ్లిద్దరికి తోడుగా రియల్ జోడీ వరుణ్ సందేష్, వితికలు కలిసి నలుగురు బిగ్ బాస్ హౌజ్ లో చాలా క్లోజ్ గా ఉన్నారు. అయితే చివరి వారాల్లో రాహుల్, వరున్ సందేష్ గొడవపడటం.. వాళు విడిపోవడం మళ్లీ ఫైనల్ గా కలిసిపోవడం జరిగింది. 

 

రాహుల్ విన్నర్ అయ్యాక కొన్నాళ్లు రాహుల్ ఎక్కడ ఉంటే అక్కడ పునర్నవి కనిపించేది. వీళ్ల జోష్ చూసి ఇద్దరి సైడ్ పేరెంట్స్ ఒప్పుకున్నారని.. పెళ్లికి కూడా ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే అసలు విషయం ఏంటంటే రాహుల్, పునర్నవి లవ్ స్టోరీ అంతా హౌజ్ లో వరకే. అక్కడ కూడా మేమిద్దరం కేవలం మంచి స్నేహితులుగా ఉన్నామని అంటున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ పునర్నవి అసలు రాహుల్ ను తాను ప్రేమించలేదని.. మా మధ్య అలాంటి రిలేషన్ లేదని.. మేము జస్ట్ స్నేహితులుగా ఉంటున్నాం అని చెప్పింది.

 

హీరోయిన్ గా చేస్తూ సింగర్ గా ప్రేమ అంటే ఒప్పుకోరని అనుకుందో లేక నిజంగానే రాహుల్ మీద తనకు ఆ ఎఫెక్షన్ లేదో తెలియదు కాని పునర్నవి మాత్రం తనకు రాహుల్ తో ఎలాంటి సంబంధం లేదని.. వు ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కొత్త షాక్ ఇచ్చింది. మరి అమ్మడు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే హౌజ్ లో రాహుల్ పై ఆమె చూపించిన స్పెషల్ ఇంట్రెస్ట్ అంతా గేం కోసమే అని అర్ధం చేసుకోవచ్చు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: