నెల 13 తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరియు బిజెపి పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో పాటు ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు భేటీ అయిన వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంతే….అందరూ అసలు రూమ్ లో ఏం జరిగింది? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరు ముగ్గురు ఇంత అత్యవసరంగా కలవాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఇలాంటి విషయాలపై చర్చించుకుంటున్నారు కానీ అసలు వీడియో బయటకు ఎలా వచ్చినట్లు?

 

ప్రతి ఒక్కరూ వీడియో లీక్ అయింది బయటకు వచ్చింది అంటున్నారు కానీ దానిని బయట పెట్టింది ఎవరు అనే విషయం పై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతానికి హోటల్ సిబ్బంది లేకపోతే ఎవరో ఒకరు పొరపాటున వీడియోని బయటపెట్టారు అని అనుకుందాం. ప్రస్తుతం ఏపీ లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వంటి ప్రముఖులు ఉన్న వీడియోని బయట పెట్టే ధైర్యం ఎవరికి ఉంటుంది?

 

అదీ కాకుండా పార్క్ హయత్ హోటల్ ఏమీ చిన్నాచితక హోటల్ కాదు. వారికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి వాటికి లోబడి హోటల్ సిబ్బంది పని చేయకపోతే కస్టమర్లు వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు అనగా గోప్యతకు భంగం కలిగిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అది కూడా ఇటువంటి పెద్ద రాజకీయ నాయకుల విషయంలో అయితే అయితే హోటల్ పై తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయి.

 

ఇటువంటి పరిస్థితుల్లో ఇందులో పొలిటికల్ యాంగిల్ లేదు అనడానికి అయితే లేదు. అయితే జగన్ మద్దతుదారులు లేదా చంద్రబాబు ని విపరీతంగా ద్వేషించేవారు ఎవరైనా ఇలా వీడియోని బయటపెట్టారు అని లేదంటే పక్కా ప్రణాళిక ప్రకారం నిమ్మగడ్డని ఫాలో అయితే లేదా సుజనాచౌదరి పై నిఘా పెడితే పొరపాటున వీడియో బయటకు వచ్చిందా..? అన్నది తెలియాలి.

 

రాజకీయ నాయకుల హస్తం ఉంటే మాత్రం అది టిఆర్ఎస్ కావచ్చు.... వైసిపి కావచ్చు అంతెందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి మళ్లించేందుకు టిడిపి వారే కావచ్చు. ప్రస్తుతానికైతే సుజనా చౌదరికి ఇది ఎవరు చేశారో తెలుసుకునే ఛాన్స్ ఉంది అతని పై బీజేపీ హైకమాండ్ నుండి ఎటువంటి ఇబ్బంది లేకపోతే మాత్రం కచ్చితంగా వీడియో ఎలా లీక్ అయిందో తెలుసుకుంటాడు. ఎందుకంటే అతను చాలా రోజుల నుండి అక్కడే ఉంటున్నానని చెప్పాడు కాబట్టి హోటల్ వారు అతనికి సంజాయొషీ ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ప్రస్తుతానికైతే దీనిని లీక్ చేసిన అతను మాత్రం అందరికీ నిజం తెలిపిన ప్రజల పార్టీ మనిషి.

మరింత సమాచారం తెలుసుకోండి: