అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన భానుమతీ రామక్రిష్ణ మరికొది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీ వేదికల ద్వారా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దాన్లో భాగంగానే ఇప్పటికే చాలా చిత్రాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అయితే ఆ సినిమాలకి సరైన స్పందన లభించలేదు. 

 

 


ప్రస్తుతం నవీన్ చంద భానుమతీ రామక్రిష్ణ ఓటీటీ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. సలోని లుత్రా హీరోయిన్ గా  నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం అల్లు అరవింద్ ఆహా యాప్ ద్వారా స్ట్రీమింగ్ అవనుంది. జులై 13వ తేదీ నుండి ఈ చిత్రం ఆహా యాప్ లో అందుబాటులో ఉండనుంది.

 

 

అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా భానుమతీ రామక్రిష్ణ టీమ్ చిన్నపాటి టీజర్ ని రిలీజ్ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ముఫ్పై ఏళ్ళకి పైబడిన ఇద్దరు స్త్రీ 30 ఏళ్లకి పైబడ్డ ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య పుట్టే ప్రేమని చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సలోని లుత్రా సిటీ అమ్మాయిగా కనిపించనుండగా, నవీన్ చంద్ర ఏ లక్ష్యం లేని మామూలు స్మాల్ టౌన్ అబ్బాయిలా కనిపించనున్నాడు.

 

ఒకే ఆఫీసులో పనిచేసే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తి గొలిపేలా కనిపిస్తున్నాయి. పెళ్ళి కోసం వెయిట్ చేస్తున్నా వారిద్దరిలో కలిగే ప్రేమ ప్రధానాంశంగా ఉండనుందని తెలుస్తుంది. మరి ఆహా యాప్ ద్వారా రిలీజ్ అవబోతున్న ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: