కరోనా దెబ్బకి సినిమా ఇండస్ట్రీకి తగిలిన దెబ్బ సామాన్యమైంది కాదు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ ప్రారంభించేందుకు అనుమతులు తెచ్చుకుని మరీ గడప దాటలేక పోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాలకు కొత్త సినిమాల మీద ఆశ లేదు కానీ.. తీసిన సినిమాలు విడుదల చేసుకోవాల్సిన పరిస్థితులు నిర్మాతలది. ఇప్పట్లో ధియేటర్ రిలీజ్ కష్టమని తేలిపోవడంతో అందివచ్చిన అవకాశంగా వీరికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కనపిస్తున్నాయి. అయితే.. ఓటీటీల్లో కొత్త సినిమాలకు ఆదరణ దక్కుతుందా అంటే అది కూడా ప్రశ్నార్ధకంగానే ఉంది. రీసెంట్ గా ఓటీటీల్లో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి చూస్తే ఇదే అనిపిస్తోంది.

IHG

 

జ్యోతిక తమిళ సినిమా ‘పొన్మాగళ్ వందాళ్’, కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’, హిందీలో అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’.. ఓటీటీల్లో అనుకున్నంత సక్సెస్ కాలేదు. ధియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియక ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. కానీ.. ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో అంత ఆదరణ కనపడటం లేదు. పెంగ్విన్ సినిమాకు పేరు రాలేదు.. క్రిటిక్స్ కూడా తేల్చేశారు. గులాబో సితాబో క్రిటిక్స్ మెప్పు వచ్చినా ప్రేక్షకాదరణ లేదు. జ్యోతిక సినిమా కూడా అంతే. మంచి ఆఫర్ వచ్చిందని రిలీజ్ చేస్తున్నారో.. సినిమాపై నమ్మకం పోయి రిలీజ్ చేస్తున్నారో కానీ.. ఓటీటీలో కొత్త సినిమాలు సక్సెస్ కావడం లేదు.

IHG

 

ధియేటర్లలో వచ్చిన సినిమాలను చూడడానికి మాత్రమే ఓటీటీలు పనికొస్తున్నాయా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ధియేటర్ల మనుగడ కోసం ఆందోళన చెందుతున్న వారికి ఇది సంతోషాన్నిచ్చేదే. ఇదే కంటిన్యూ అయితే ఓటీటీ యాజమాన్యం కూడా మంచి ఆఫర్లు ఇవ్వలేవు. షూటింగ్స్ కు అనుమతి తెచ్చుకున్నా షూటింగ్స్ జరపలేని పరిస్థితి.. పూర్తైన సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి. పరిస్థితులు చక్కబడ్డాకే వీటన్నింటికీ సమాధానం దొరకాలి. అదెప్పుడనేదే ప్రశ్న.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: