ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయానికి వస్తే ఎక్కువగా అనుష్క పేరు వినబడేది. అరుంధతి, భాగమతి ఇంకా కొన్ని సినిమాలలో అనుష్క నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఆ తర్వాత 'సైజ్ జీరో' సినిమాకి అనుష్క బాగా లావు పెరగడం అందరికీ తెలిసిందే. దీంతో ఆ సినిమా తరువాత మళ్లీ పూర్వపు తేజం అనుష్క రాబట్టకపోవడంతో ప్రస్తుతం అనుష్క చేయాల్సిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు సమంతా తన ఖాతాలో వేసుకుంటున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు జోరందుకున్నాయి. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సమంత భారీ ఎత్తున ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

IHG

అంతే కాకుండా ఇంకా చాలా ఓరియెంటెడ్ సినిమాలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నటిస్తున్న తరుణంలో..ఇవి చాలా వరకు అనుష్క చేయాల్సిన ప్రాజెక్టులన్నీ...అని ఆమె ఫిజిక్ వల్ల ఆ అవకాశాలు కోల్పోవడంతో సమంత చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సమంతా పై అనుష్క అభిమానులు సీరియస్ అవుతున్నారట. తమ అభిమాన నటి చేయాల్సిన సినిమాలను సమంతా చేయటంతో అనుష్క అభిమానులు అసూయ పడుతున్నారట.

IHG

చాలా వరకు అనుష్క 'సైజ్ జీరో' సినిమా కోసం లావు పెరగటంతో ఆ తర్వాత మళ్ళీ ఫిట్ రావటానికి కష్టపడిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో అనుష్కకి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు దూరమవడంతో ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరో పక్క పెళ్లయిన తర్వాత సమంత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల అవకాశాలు అందుకుని ప్రేక్షకులను అలరించడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: