టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అక్కినేని నాగేశ్వర రావు నుంచి అఖిల్ వరకూ అందరూ రొమాంటిక్ హీరోలుగా పేరు తెచ్చుకున్నవారే. అందరూ సినీ లైఫ్ స్టైల్ కు తగ్గట్టే హైఫై స్టైల్లో, స్టయిల్ గా కనిపిస్తారు. వీళ్లను ఎప్పుడూ ఆధ్యాత్మిక లుక్ లో చూసింది లేదు.. వారు కనిపించింది లేదు. అటువంటింది అక్కినేని మూడో తరం హీరో అఖిల్ ఆధ్యాత్మిక లుక్ లో కనిపించి అందరినీ షాక్ కు గురి చేశాడు. అవును.. అఖిల్ అయ్యప్ప మాల వేసుకున్నాడు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

IHG

 

ఇటివల అఖిల్ అన్నయ్య నాగచైతన్య, సమంతలతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో రౌండ్ అవుతోంది. అందులో అఖిల్ అయ్యప్ప దీక్ష వేసుకుని ఉన్నాడు. నిజంగానే అఖిల్ కొత్తగా కనిపిస్తున్నాడు. అసలే తెల్లగా చబ్బీగా ఉండే అఖిల్ ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లోనే కనిపిస్తాడు. కానీ.. ఈసారి భక్తి భావంతో పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోవడం విశేషమే. అఖిల్ మాలధారణ వేసుకోవడానికి రామ్ చరణ్ కారణమనే వార్తలు కూడా వస్తున్నా ఇందులో క్లారిటీ లేదు. రామ్ చరణ్ ప్రి ఏటా అయ్యప్ప మాల వేసుకోవడం తెలిసిందే. శర్వానంద్ కూడా దీక్ష తీసుకునే విషయం తెలిసిందే.

IHG

 

కెరీర్ పరంగా అఖిల్ ప్రస్తతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్సినిమా నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాపై అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. అఖిల్ గత మూడు సినిమాలు బక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ ట్రాక్ పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: