టాలీవడ్ స్టార్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయంతెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మిగిలిన షూటింగ్ అతిత్వరలో ముగించి సాధ్యమయినంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ లాస్ట్ మూవీ అజ్ఞాతవాసి రిలీజ్ అయి రెండున్నరేళ్ళకు పైగా గడుస్తుండడంతో, ఆయనను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక వకీల్ సాబ్ తో పాటు మరొకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ లో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

IHG

సినిమా కూడా కొంతవరకు షూటింగ్ జరుపుకుంది. కాగా అతి త్వరలో దాని షూటింగ్ కూడా మొదలెట్టేలా యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇకపోతే ఈ రెండు సినిమాల తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. పవన్ కెరీర్ 28వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎందుకనగా, గతంలో పవన్, హరీష్ ల కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతో గొప్ప విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

 

అయితే మొదటి నుండి మన తెలుగు సినిమాల్లోని ఇటువంటి భారీ హిట్ కాంబోలను ఒకసారి పరిశీలిస్తే, గతంలో ఈ విధంగా తొలిసారి అత్యద్భుత విజయాలను అందుకున్న కాంబినేషన్ లు, తదుపరి సినిమాలను ఆ రేంజ్ లో సక్సెస్ చేసిన దాఖలాలు చాలావరకు తక్కువేనని అంటున్నారు విశ్లేషకులు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పటికే ఈ సినిమా కోసం దర్శకుడు హరీష్ ఒక పవర్ఫుల్ స్టోరీ ని సిద్ధం చేసారని, తప్పకుండా ఈ సినిమా గబ్బర్ సింగ్ ని మించేలా సక్సెస్ అవుతుందని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో తెరకెక్కనున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: