సోషల్ మీడియాలో నకిలీ వార్తలు హద్దు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా సినీ నటీనటుల గురించి భయంకరమైన నకిలీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ని రోజులు పెళ్లి కానీ హీరో హీరోయిన్లకు పెళ్లి అంటూ నెటిజన్లు ప్రచారం చేసేవారు. తాజాగా పిల్లలు కూడా పుట్టారంటూ అసత్య ప్రచారానికి తెరలేపారు. తాజాగా కన్నడ నటి, బిగ్‌బాస్‌3 ఫేమ్‌ నేహ గౌడకు ఈ నకిలీ వార్తల సెగ తగిలింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చిందని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె మండిపడ్డారు. తనపై ఇలాంటి అసత్యపు వార్తలు రావడం దురదృష్టకరమని ఆమె అన్నారు. అంతే కాదు ఇలాంటి వార్తల వల్ల మనసు వికలం అవుతుందని అన్నారు. 

IHG

 ఈ అసత్య ప్రచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరం. ఇలాంటి వార్తలు రాసేవారు ఏం సాధిస్తారో నాకు తెలియదు.  ఓ వార్త రాసేటప్పుడు ఎవరి గురించి రాస్తున్నారో వారిని ఒకసారి అడిగితే బాగుంటుందని నేహ గౌడ అన్నారు. తన గురించి వార్త రాసేటప్పుడు తననో, తన కుటుంబసభ్యులనో అడిగితే బాగుండేదని చెప్పారు.

 

ఇలాంటి వార్తలు రాసేముందు మీకు కూడా ఓ అమ్మ, ఓ అక్క, ఓ స్నేహితురాలు ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. దయచేసి ఓ వార్త రాసేటప్పుడు ఎవరి గురించి అయితే రాస్తున్నామో వారిని ఒకసారి అడగండి. కాలిఫోర్నియాలో నేను బిడ్డకు జన్మనిచ్చాను అనే వార్త రాసేటప్పుడు కనీసం నా కుటుంబసభ్యులతోనో, స్నేహితులతోనే మాట్లాడి ఉండొచ్చు కదా. ఓ వార్తను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ముందు నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలి.’ అని ఆమె తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: