ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం మన వాళ్ల వరకే అన్న ఆలోచన ఉండేది. కొన్నాళ్లుగా తమిళ సినిమాల ఆధిపత్యం మన సినిమాల మీద ఉండేది. ఇక ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మూవీస్ అనేలా హింది చిత్ర పరిశ్రమ విస్తరించింది. బాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఇండియన్ సూపర్ స్టార్స్ గా పరిగణిస్తారు. మన సౌత్ స్టార్స్ కు గుర్తింపు ఉన్నా బయట మార్కెట్ లో వాళ్లకు ఉన్నంత మనకు ఉండదు. అయితే రోజులు మారాయి.. పరిస్థితులు మారాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేసే సినిమాలు మనవాళ్లు తీస్తున్నారు. 

 

ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో అయితే బాలీవుడ్ షేక్ అయ్యింది. అక్కడ స్టార్స్ కూడా క్రియేట్ చేయలేని ఎన్నో రికార్డులు బాహుబలి సృష్టించింది. బాహుబలి చూపించిన బాటలోనే మిగతా స్టార్స్ కూడా తీస్తే పాన్ ఇండియా సినిమానే అనేలా ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో తీస్తున్న స్టార్ సినిమాలన్ని ఒకటో రెండో తప్ప మిగిలినవన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అదెలా అంటే ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్, ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూఒవీ ప్లానింగ్ లో ఉంది. 

 

ఆల్రెడీ పూరి డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో మూవీ కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు. వీళ్లతో పాటుగా మహేష్ తో పూరి జనగణమన కూడా నేడో రేపో ఎనౌన్స్ మెంట్ వచ్చేలా ఉంది. రాజమౌళి మహేష్ తో చేసే మూవీ కూడా నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్ లో ఉండనుంది. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ చేసే సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాధే శ్యాం సినిమా కూడా ఐదు భాషల్లో రిలీజ్ ఉంటుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా ఇప్పటికే పాన్ ఇండియా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. మొత్తానికి ఇలా బాలీవుడ్ బాక్సాఫీస్ పై తెలుగు సినిమాల సత్తా అక్కడ మన స్టార్స్ బలాబలాలు తేల్చుకునేలా ఉన్నారు. సో చూస్తుంటే టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా స్టార్స్ గా అవతారం ఎత్తబోతున్నారని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: