3 సీజన్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని నాలుగవ సీజన్ కు రెడీ అవుతుంది స్టార్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు ఆడియెన్స్ కు ఈ షో నచ్చుతుందా లేదా అని మొదట సీజన్ డౌట్ పడినా తారక రాముడు మాటల గారడితో అర్రె షో అదిరిపోయిందిగా అనేలా చేశాడు. మొదటిసారి కదా మన వాళ్లు కూడా షోలో నెక్స్ట్ ఏం జరుగబోతుంది అని చాలా ఎక్సయిట్ ఫీలయ్యారు. అంతేకాదు మొదటి సీజన్ పూణె పరిసర ప్రాంతాల్లో జరగడం వల్ల ఎలాంటి లీకులు బయటకు రాలేదు.   

 

ఇక సెకండ్ సీజన్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ సీజన్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియడం.. షో మీద కొద్దిగా ఆసక్తి తగ్గేలా చేసింది. నాని హోస్ట్ గా జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఇక 3వ సీజన్ కింగ్ నాగార్జున హోస్ట్ గా అదరగొట్టాడు. 4వ సీజన్ కు రెడీ అవుతున్న బిగ్ బాస్ తెలుగు లో ఈసారి స్టార్ సెలబ్రిటీస్ ను ఎంపిక చేస్తున్నారట. జబర్దస్త్ షోలో కొందరిని, ఈమధ్య బాగా పాపులర్ అయిన కొందరు సెలబ్రిటీస్ ను కూడా వాళ్లు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరి కంటెస్టంట్స్ గా తీసుకుంటున్నారట. 

 

రాబోయే బిగ్ బాస్ సీజన్ 4 చాలా క్రేజీగా ఉండబోతుందని అంటున్నారు. ఈసారి టాస్కులు కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఇంతకుముందులా ఎలాంటి లీకులు జరుగకుండా పర్ఫెక్ట్ ప్లాన్ చేశారట. హోస్ట్ గా నాగార్జుననే ఫైనల్ కాగా సీజన్ 4లో కంటెస్టంట్స్ ఫైనల్ లిస్ట్ ఇంకా బయటకు రాలేదు. ఈసారి బిత్తిరి సత్తి లాంటి బుల్లితెర స్టార్స్ కూడా కంటెస్టంట్స్ గా వచ్చే ఛాన్సులు ఉన్నాయట. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4 మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకునేందుకు సిద్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: