తమిళ స్టార్ హీరో విజయ్ ,మాస్టర్ తరువాత అసురన్ ఫేమ్ వెట్రిమారన్ తో సినిమా చేయనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ లోనే వెట్రిమారన్, విజయ్ ను కలిసి కథ వినిపించాడు విజయ్ కి కథ కూడా బాగా నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పాడు. దాంతో మాస్టర్ తరువాత విజయ్ తదుపరి చిత్రాన్నివెట్రిమారన్ డైరెక్ట్ చేస్తాడని అనుకున్నారు కానీ  మురగదాస్ లైన్లోకి వచ్చాడు దాంతో వెట్రిమారన్ తో సినిమా క్యాన్సల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. 
 
అయితే అసలు విషయం ఏంటంటే వెట్రిమారన్ కు విజయ్ సినిమా కంటే ముందే వేరే వారితో రెండు సినిమాల కమిట్ మెంట్ వుంది అవి పూర్తి చేశాక విజయ్ తో సినిమా మొదలుపెట్టనున్నాడు. ఈలోగా విజయ్ ,మురగదాస్ సినిమా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈఏడాది చివర్లో విజయ్- ఏఆర్ మురగదాస్ ల సినిమా మొదలుకానుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుండగా థమన్ సంగీతం అందించనున్నాడు. 
 
ఇక మాస్టర్ విషయానికి వస్తే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఏప్రిల్ లోనే  విడుదలకావల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. దీపావళికి  సినిమాను థియేటర్లోకి తీసుకరానున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఆండ్రియా ,అర్జున్ దాస్ , శాంతన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించాడు. ఈచిత్రం భారీ అంచనాల మధ్య తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది. త్వరలోనే ఈసినిమా నుండి ట్రైలర్ విడుదలకానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: