మైకల్ జోస‌ఫ్ జాక్స‌న్ ఒక అద్భుతం...భూమ్మీద అలాంటి క‌ళాకారుడు మ‌రోక‌రు పుడుతార‌న్న న‌మ్మ‌కం లేదు. త‌న‌లోని అద్భుత క‌ళా ప్ర‌తిభ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అతికొద్దిమంది క‌ళాకారుల్లో జాక్స‌న్ ఒక‌రు. త‌న అద్భుత‌మైన సంగీతంతో, డ్యాన్స్‌తో ప్ర‌పంచ పాప్ అభిమానుల‌కు ఆనందాన్ని పంచేశాడు. క‌ఠోర శ్ర‌మ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం మైక‌ల్ జాక్స‌న్‌. జాక్స‌న్ స్ఫూర్తితో కొన్ని ల‌క్ష‌ల మంది క‌ళాకారులు రాణించారు. జాతి విద్వేషాలు ఓ స్థాయిలో కొన‌సాగుతున్న కాలంలోనే  అమెరికా  శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు కూడా జాక్స‌నే.  పాప్ రారాజుగా అభిమానులు ఎంతో ఇష్టంగా పిలుచుకునే జాక్స‌న్ ఎదిగిన తీరు కూడా స్ఫూర్తిదాయ‌క‌మేన‌ని చెప్పాలి.

 

మైకల్ జోసెఫ్ జాక్సన్ ఆగష్టు 29, 1958లో జ‌న్మించారు.  జూన్ 25, 2009లో మ‌ర‌ణించేంత వ‌ర‌కు కూడా సంగీత‌మే ఆయువుగా బ‌తికాడు. పేద‌రికంలో పుట్టిన జాక్స‌న్....మ‌ర‌ణించే నాటికి మాత్రం ఎంతో డ‌బ్బు క‌లిగి ఉన్నాడు. పేద‌రికంలో పుట్ట‌డం త‌ప్పు కాదు...పేద‌రికంలో చావ‌డంలో మాత్ర క‌చ్చితంగా త‌ప్పే అంటూ ఆయ‌న త‌రుచూ త‌న స‌న్నిహితుల వ‌ద్ద అనేవార‌ట‌. ఆలా అని డ‌బ్బుపై జాక్స‌న్‌కు పెద్దగా వ్యామోహం లేదు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన మొత్తాన్ని మాత్రం ఏనాడు వ‌ద‌లుకోలేదు. జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డులు గెలుచుకోవ‌డం ఆయ‌న‌లోని ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా.  

 

అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం  త్రిల్లర్‌. జాక్సన్ పాడ‌టం మొద‌లు పెట్టింది కేవ‌లం పది సంవత్సరాల వయసులో కావ‌డం విశేషం.  తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో అదే ప‌ని చేస్తూ వ‌చ్చాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.  జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1988 నుంచి 2005 వరకు జాక్సన్ తన నెవెర్‌లాండ్ రాంచ్లో ఉన్నాడు. అక్కడ ఒక జూ, అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. 11 ఫిబ్రవరి 2008 నాడు జాక్సన్ త్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు. అదే జాక్స‌న్ చివ‌రి ఆల్బం కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: