టాలీవుడ్ లో మహేష్ బాబు కి రామ్ చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరు ఇద్దరికీ కూడా బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఒకటి అయితే వీరు ఇద్దరి సినిమాలకు మాస్ లో మంచి క్రేజ్ ఉండటం అలాగే క్లాస్ హీరో లు గా కూడా గుర్తింపు తెచ్చుకోవడం కూడా వీళ్ళకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక వీరి కాంబినేషన్ లో సినిమా కోసం టాలీవుడ్ లో జనాలు ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా వచ్చినా సరే చాలు అని మహేష్ బాబు రామ్ చరణ్ కి అన్నయ్యగా నటించాలి అని కోరుతున్నారు. 

 

వీరి కాంబినేషన్ లో సినిమా రావాలి అని అది పవన్ కళ్యాణ్ నిర్మిస్తే బాగుంటుంది అని లేదా ఎన్టీఆర్ నిర్మిస్తే బాగుంతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. మరి వీరి కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా వస్తుందా అనేది చూడాలి. ఇద్దరికీ కమర్షియల్ హీరో లు గా మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఇక అందుకే వీరి కి క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది అనే విషయం చెప్పవచ్చు. ఇక వీరు ఇద్దరూ కూడా ఇప్పుడు చాలా వరకు బిజీ గా ఉన్నారు. వచ్చే ఏడాది వరకు కూడా వీళ్ళు సినిమాలు ఓకే చేసే పరిస్థితి లేదు అనే చెప్పాలి. 

 

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో చేస్తూ ఉండగా మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే వార్తలు ఆ మధ్య బాగానే వచ్చాయి గాని అది నిజమా లేదా అనేది చూడాలి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు కావాలి అంటే కచ్చితంగా మల్టీ స్టారర్ అనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: