ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వస్తున్నా సంగతి తెలిసిందే. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా ఈ సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోలు అయితే మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని చేస్తున్నారు. టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హవా మొదలైన నేపథ్యంలో దగ్గుబాటి వారసులు విక్టరీ వెంకటష్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తే బాగుంటుందనే కోరిక ఫ్యాన్స్ నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారీ స్కీన్ మీద కాకున్న బుల్లితెరపై ఈ అబ్బాయి, బాబాయి కలిసి నటించనున్నరనే వార్త మీడియాలో జోరుగా షికారు చేస్తున్నదన్నారు.

 

 

ఒక కీలక పాత్ర కోసం రానా తన సినిమాలో వెంకటేష్ ని అడిగినట్టు సమాచారం. రానా అడగడం తో వెంకటేష్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. తన తాత జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను కూడా రానా ప్లాన్ చేసాడు. దానికి వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఇప్పుడు తమ సినిమాల్లో మరో మెగా హీరోని పెట్టుకునే విధంగా సినిమాలు చేస్తుంది. రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు కూడా దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. 

 

 

ఇప్పుడు వెంకటేష్ ఫ్యామిలీ కూడా ఇదే ప్రయత్నం లో ఉంది. రానా ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తుండగా వెంకటేష్ నారప్ప అనే సినిమా చేస్తున్నాడు. నారప్ప సినిమా తమిళ రీమేక్. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమాకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే నాగ చైతన్య వెంకటేష్ కలిసి ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: