నేటి రోజుల్లో సినిమాపై అంచనాలు పెరగాలంటే హీరో, దర్శకులను బట్టి ఉంటుంది. అదే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయితే మరింత అంచనాలు పెరిగిపోతాయి. అభిమానులు, బిజినెస్ సర్కిల్స్ లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ప్రస్తుతం బాలకృష్ణబోయపాటి శ్రను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై ఇదే స్థాయి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా బాలకృష్ణ పుట్టినరోజుకు విడుదలైన టీజర్ తో ఆ విషయం పక్కాగా ప్రూవ్ అయింది. బాలకృష్ణ డైలాగ్ డిక్షన్, బోయపాటి టేకింగ్ రెండూ సమపాళ్లలో అలరించాయి. ఇంకా టైటిల్ నిర్ఱయించని ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త రౌండ్ అవుతోంది.

IHG

 

సినిమాలో బాలకృష్ణ పాత్ర ద్వారా మరిన్ని భారీ డైలాగులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమా కథకు తగ్గట్టుగా ఉంటూనే ప్రస్తుత సినీ, రాజకీయ పరిస్థితులను బేస్ చేసుకుని డైలాగ్స్ ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. ఇప్పటికే ఈ టీజర్ లో.. ‘శ్రీను గారూ మీ నాన్నగారు బాగున్నారా అనడానికి.. శ్రీను గారూ నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉంది.. ఎదుటి వాళ్లతో సరిగ్గా మాట్లాడటం నేర్చుకో..’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ రాజకీయంగా బాగా చర్చనీయాంశమైంది.

IHG

 

ఈ డైలాగ్ బాగా పాపులర్ కావడంతో ఇప్పుడు మరిన్ని పంచ్ డైలాగ్స్ ను పెన్నింగ్ చేస్తున్నాడట బోయపాటి శ్రీను. ఈ వార్తలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. బాలకృష్ణబోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సింహ, లెజెండ్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరిక కాంబోలో వస్తున్న ఈ మూడో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా టైటిల్ పై కూడా పలు గాసిప్స్ రౌండ్ అవుతున్నాయి. ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం.

IHG'Hamsaladeevi' sequel?

మరింత సమాచారం తెలుసుకోండి: