ఏంటి నిజమా? ఈ కాంబినేషన్ లో సినిమానా? అసలు చూడగలమా? అనే డౌట్ మీకు వస్తుంది కదా! నిజమే ఈ కంబినేషన్ లో నిజంగా సినిమా వస్తే హిట్టు అవుతుంది అంటారా? అయినా ఆ కాంబినేషన్ వింటేనే వాంతు వస్తుంది అని అంటున్నారు కొందరు నెటిజన్లు. అయితే తండ్రి ప్లేస్ లో బాలయ్య.. కొడుకు ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఉండేలా ఓ సినిమా వస్తే సూపర్ హిట్ అవుతుంది అని అంటున్నారు కొంతమంది నెటిజన్లు. 

 

IHG

 

ఒకవేళ బాలయ్య బాబు తండ్రిలా కాకుండా అన్నలాగా విజయ్ తమ్ముడులాగా తీస్తే సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మల్టి స్టారర్ సినిమాలో బాలయ్య నటించి అది కాస్త విజయ్ దేవరకొండతో బాలయ్య నటిస్తే హిట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అంతేకాదు బాలయ్య సినిమాలకు ఈమధ్యకాలంలో మంచి హిట్స్ లేవు అని.. అలానే విజయ్ దేవరకొండకు కూడా హిట్స్ లేవు అని అందుకే వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే మంచి హిట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

IHG

 

అయితే బాలయ్య బాబుతో విజయ్ దేవరకొండ సినిమా ఓకే.. మల్టీ స్టారర్ ఓకే. మరి వీళ్ళ ఇద్దరి కాంబోకు ఏ దర్శకుడు అయితే? బాగుంటుంది? ఖచ్చితంగా పూరి జగన్నాథ్ దర్శకత్వం అయితేనే సినిమా హిట్ అవుతుంది. అతను అయితే ఈ ఆటిట్యూడ్ ఉన్న హీరోలను మానేజ్ చేసి సినిమాను హిట్ చెయ్యగలడు. ఎందుకంటే బాలయ్యను, విజయ్ దేవరకొండను చదివింది కేవలం బాలయ్య పూరి జగన్నాథ్ ఏ. మరి వీరి ఇద్దరి కాంబో భవిష్యేత్తులో అయినా వస్తుంది ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: