ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువైన విషయం తెలిసిందే. అటు తెలుగు అభిమానులందరూ మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా ఆదరిస్తుండటంతో  దర్శక నిర్మాతలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఒక హీరోతో సినిమా తీయడం కంటే  ఇద్దరు హీరోలను పెట్టి సినిమా తీస్తే సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అవుతుందని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక హీరోతో అయితే ఆ హీరో అభిమానులు సినిమా చూస్తారు అదే ఇద్దరు హీరోలు అయితే ఇద్దరు హీరోల అభిమానులు ఈ సినిమా చూడడంతో పాటు వీరిద్దరి మల్టీస్టారర్  కోసం ఎదురుచూస్తున్నా వారు  సినిమా చూడటానికి ఆసక్తి చూపుతారు. 

 


 అదే సమయంలో ఈ సినిమాకి మార్కెట్ కూడా బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఇలా స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ  బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటూ ఉంటారు హీరోలు . అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో తెలుగు ప్రేక్షకులు  ఎంతగానో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమా ఎన్టీఆర్ మహేష్ బాబు సినిమా. వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు నందమూరి అభిమానులు ఇటు ఘట్టమనేని అభిమానులు కూడా ఈ మల్టీ స్టారర్ వస్తే బాగుండు అని ఎంతో ఆశగా ఉన్నారు. 

 


 అయితే ఎలాంటి పాత్రలోనైనా తనదైన నటనతో మెప్పించి ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. అదేసమయంలో తనదైన డైలాగ్ డెలివరీతో నటనతో ఆకట్టుకుంటూ ఎంతోమందిని అలరిస్తూ ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే నటన విషయంలో వీరిద్దరి శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని చెప్పాలి. వీరి సినిమాలు కూడా ఎక్కడా పోలి ఉండవు. మరి వీరిద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తే ఆ సినిమా స్టోరీ ఎలా  ఉంటుంది... వీరి పాత్రలు ఎలా ఉంటాయి అన్నది అభిమానులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: