ముందుగా రవితేజ, జ్యోతికల కలయికలో వచ్చిన షాక్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు హరీష్ శంకర్, ఆ సినిమా ఘోర పరాజయాన్ని అందుకోవడంతో తదుపరి సినిమా తీయడానికి కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆపై తన తదుపరి సినిమా మిరపకాయ్ ని కూడా రవితేజతోనే తీసిన హరీష్, మొత్తానికి రెండవ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం జరిగింది. అనంతరం తదుపరి ఏడాదిలోనే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సినిమాకు దర్శకత్వం వహించే గొప్ప ఛాన్స్ హరీష్ ని వరించడం, ఇక స్వతహాగా పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిన హరీష్, తనకు వచ్చిన ఆ గొప్ప అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని తన అభిమాన హీరోకు గబ్బర్ సింగ్ రూపంలో సూపర్ డూపర్ హిట్ ని అందించడం జరిగింది. 

IHG

ఇక ఆ తరువాత నుండి ఇప్పటివరకు పవన్, హరీష్ ల కాంబో లో మరొక సినిమా వస్తే చూడాలని పవన్ ఫ్యాన్స్ ఆశపడుతుండగా, ఎట్టకేలకు ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వారిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కెరీర్ 28వ సినిమా గా రానున్న ఈ సినిమాని పవన్ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల అనంతరం మొదలెట్టనున్నారు. ఇక మరోవైపు తాను సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కూడా మరొక అద్భుతమైన కథను సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా హరీష్ శంకర్ చెప్పడం జరిగింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా హరీష్ తో ఒక సినిమా పడితే చూడాలని ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే తన సినిమాల్లోని హీరోలను మంచి మాస్ స్టైల్ లో పక్కాగా కమర్షియల్ గా చూపించే హరీష్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుంది. 

 

అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య దాగి ఉందని అంటున్నారు. గబ్బర్ సింగ్ అనంతరం ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమా తీసిన హరీష్, ఊహించని విధంగా ఆ సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ని చవిచూశారు. వాస్తవానికి ఆ సినిమాకు కూడా తాము ఎంతో కష్టపడ్డాం అని, అయితే ఎందుకో ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని, ఎన్టీఆర్ గారు తనను నమ్మి సినిమా చేసారని, రాబోయే రోజుల్లో ఆయనతో మరొక హిట్ సినిమా తీస్తానని గతంలో పలు మార్లు హరీష్ చెప్పడం జరిగింది. ఒకవేళ పవన్ తరువాత తమ హీరోతో కనుక హరీష్ సినిమా చేస్తే, దానిని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే రేంజ్ లో తీయాలని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి రాబోయే రోజుల్ హరీష్ శంకర్ పవన్, మహేష్ లకు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తారో చూడాలి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: