కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన మూవీ సురేశ్ ప్రొడక్షన్స్ మూవీ ‘కృష్ణ అండ్ హిస్ లీల’. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచీ మంచి బజ్ క్రియేట్ అయింది. కారణం.. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించడమే. పైగా.. సినిమాకు రానా దగ్గుబాటి నిర్మాత కావడంతో మరింత హైప్ వచ్చింది. అయితే ఈ సినిమా ఈరోజు ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.

IHG's ...

 

కానీ.. రానా దగ్గుబాటి తీసుకున్న డెసిషన్ ఆశ్చర్యపరుస్తోంది. మూడు రోజులుగా వరుసగా సినిమాకు సంబంధించి ఒక్కో స్టోరీ రివీల్ చేసారు. ఇప్పుడు ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా ఈ రోజు సడెన్ గా రిలీజ్ చేసేశారు. నిజానికి కొద్ది రోజుల ముందు ఫస్ట్ లుక్ రివీల్ చేసినప్పుడు.. సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తాం.. అన్నారే కానీ ఎందులో, ఎప్పుడు అనే విషయాలు తర్వాత రివీల్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ.. ఇప్పుడు సడెన్ గా ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిపోయింది. సినిమా బిజినెస్ లో తల పండిన సురేశ్ ప్రొడక్షన్స్ పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేయడం విచిత్రమే.

IHG's Stills From <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KRISHNA AND HIS LEELA' target='_blank' title='krishna and his leela-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>krishna and his leela</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> ...

 

కేరాఫ్ కంచరపాలెం సినిమా విషయంలో మంచి పబ్లిసిటీ చేశాడు రానా. అయితే.. అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. అయినా ఓటీటీల్లో జనం సినిమా చూడాలంటే కనీసం ప్రమోషన్ చేయాల్సిందే. కానీ చడీచప్పుడు లేకుండా సినిమాను సడెన్ గా రిలీజ్ చేసేశాడు. మరోపక్క సినిమాకు రివ్యూల పరంగా మిక్సిడ్ రిపోర్ట్ వస్తోంది. మరి నెట్టింట్లో ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: