వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదొక వివాదంతో నిత్యమ్ వార్తల్లో నిలుస్తారు. రోజూ ఏదొక కామెంట్ చేయకపోతే వర్మ కు నిద్ర పట్టదు అనుకుంటా...విభిన్న తరహాలో చిత్రాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్న వర్మ వ్యక్తిత్వం మాటతీరు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.  ఇటీవల కాలంలో రియల్ స్టోరీలతో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు రాంగోపాల్ వర్మ.
 రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ కోసం చాలా మంది యుట్యూబర్లు క్యూ కడతారు. 

 


తాజాగా మన స్టార్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ వర్మను ఇంటర్వ్యూ చేస్తూ అతన్ని ఎలాంటి విషయాలైతే అడగకూడదో.. సరిగ్గా అదే టాపిక్ తీసుకువచ్చింది. ఆ యాంకర్ రీసెంట్ గా ఏ యాంకర్ ని చూస్తే మీకు వావ్ అనిపించింది అని ఆడిగితేయా  దానికి బదులుగా చాలామంది ఉన్నారు, అందులో నువ్వు కూడ ఉన్నావ్ అంటూ చెప్పాడు. అతని ఆన్సర్‌కి తెగ సిగ్గుపడిపోయిన యాంకర్.. థాంక్యూ సార్ అంటూ మరో చిలిపి ప్రశ్న వేసింది. ‘మనిషికి కోరికలు అనేవి కామన్.. మీకు ఇప్పటి వరకూ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా’? అని అడిగితే...నాకు కలిగిన ప్రతి కోరికను తీర్చుకుంటాను. తీరని కోరికలు అంటూ ఏమి లేవు. నేను కోరికలను ఎంజాయ్ చేస్తాను అంటాడు. ఆ టైంలో ఎలాంటి కోరిక కలిగినా వెంటనే తీర్చేసుకుంటా అని బదులిస్తాడు.

 

ఒకవేళ నా కోరిక తీరనిది అయితే.. దాన్ని నేను వెంటనే మర్చిపోతా. దాన్ని పట్టుకుని వేలాడను అని అంటూనే నిజానికి నిన్ను బికినీలో చూడాలని ఉంది.. నేను నీకు ఆఫర్ ఇస్తా బికినీలో ఓ రోల్ చేయడానికి నీకు ఇష్టమైతే చేయిస్తా, లేదంటే ఆ కోరికను వదిలేసుకుంటా’ యాంకర్ మీదే ఒక బాంబ్ వేసేసాడు. ఆ మాటకి యాంకర్ ఒక్కసారిగా షాక్ అయి తెరుకోడానికి చాలా టైమ్ నే తీసుకుంది. అయితే వర్మ ఇలా సెటెయిర్ లు వేయడం, తలతిక్క సమాధానాలు చెప్పడం ఇదేమి మొదటిసారి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: