కోలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో నయనతార ఒకరు. ముఖ్యంగా కథానాయికగా ఆమె చేస్తున్న సినిమాలు అక్కడ స్టార్ హీరోలకు కూడా నిద్రపట్టకుండా చేస్తున్నాయంటే నమ్మాల్సిందే. తెలుగులో కూడా నయనతారకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో సీనియర్ హీరోల సరసన అడపాదడపా వచ్చి అలరించే నయనతార తమిళంలో మాత్రం ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది.  

 

కోలీవుడ్ లో నయనతార నటించిన క్రేజీ మూవీస్ లో ఆరమ్ ఒకటి. గోపి నైనార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బోరు బావిలో పడిన ఓ పిల్లాడిని కలెక్టర్ తన తెలివి తేటలతో ఎలా కాపాడింది అన్నది చాలా ఆసక్తిగా చూపించారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. కొన్ని సినిమాలు కథల రూపంలో ఉండగా ఒక పార్టే అనుకుంటారు కాని సినిమాగా తెరకెక్కించినపుడు మాత్రం అవుట్ పుట్ బాగా వస్తే దాని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఆరమ్ అదే తెలుగులో కర్తవ్యం సినిమాకు అదే స్కోప్ దొరికింది.

 

ఆ సినిమ చివర్లో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ప్రజలకు సేవ చేసేందుకు వెళ్తున్నా అంటూ చెబుతూ ఎండ్ కార్డ్ వేస్తారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వల్ లో ఆమె ఓ పొలిటిషియన్ గా కనిపిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సీక్వల్ లో కీర్తి సురేష్ నటిస్తుందనే వార్తలను ఖండించారు డైరక్టర్ గోపి. నయనతార తోనే ఆరమ్ 2 సినిమా ఉంటుందని అన్నారు. సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యిందని త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ప్రస్తుతం నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో సమంత కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: