తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా హీరోలంతా తుపాకీ పడుతున్నారు. శత్రువులను చంపేస్తామని బార్డర్ లో కాపలా కాస్తున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టి.. విజయపతాకం ఎగురవేసేందుకు మిలిటరీలో చేరుతున్నారు. జై జవాన్ నినాదంతో కొత్త క్యారెక్టర్ లోకి వెళ్లిపోతున్నారు. 

 

పూరీ జగన్నాథ్ సినిమాలు ఒక పర్టిక్యులర్ మీటర్ లో ఉంటాయి. కమర్షియల్ కోటింగ్ తో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ లా తెరకెక్కుతాయి. హీరో క్యారెక్టరైజేషన్ పక్కా పోకిరీలా ఉంటుంది. అయితే ఇప్పుడీ ఫార్మాట్ ని మార్చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. జనగణమన సినిమాను మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నాడు పూరీ. 

 

పూరీ జగన్నాథ్ డ్రీ ప్రాజెక్ట్ జనగణమన . చాన్నాళ్ల క్రితమే ఈ సబ్జెక్ట్ ని డిజైన్ చేసి పెట్టుకున్నాడు పూరీ. ఇక పూరీ కనెక్ట్స్ లో చాలా రోజులుగా డిస్కషన్స్ లో ఉన్న ఈ సబ్జెక్ట్ ని.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. లార్జ్ స్కేల్ లో తెరకెక్కించాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అనేది మాత్రం బిగ్ క్వశ్చన్ గా మారుతోంది. 

 

యునిక్ స్టోరీస్ తో మెప్పించే అడవి శేష్ కూడా తుపాకీ పడుతున్నాడు. 26/11 ముంబయి దాడుల్లో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథాంశంతో నటిస్తున్నాడు. మేజర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేశ్ బాబు నిర్మిస్తున్నాడు. 

 

ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సినిమా సూపర్ హిట్ అవుతుంది. భారీ వసూళ్లు దక్కుతాయి. ఇక దేశభక్తి కథాంశాలైతే బాక్సాఫీస్ కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఈ టచింగ్ తోనే చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ బ్లాక్ బస్టర్ల ఇన్సిపిరేషన్ తోనే ఇప్పుడు మిలిటరీ కథాంశాలు తెరకెక్కుతున్నాయి. 

 

మహేశ్ బాబు సంక్రాంతి మూవీస్ లో సూపర్ హిట్ గా నిలిచింది సరిలేరు నీకెవ్వరు. మహేశ్ ఫస్ట్ టైమ్ మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో నటించిన ఈ సినిమా 100కోట్లకు పైగా వసూల్ చేసింది. మహేశ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గస్ట్ హిట్ గా నిలిచింది సరిలేరు నీకెవ్వరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: