టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన సినిమా పోకిరి. మహేష్ బాబు సోదరి మంజులతో కలిసి దర్శకుడు పూరి కూడా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మహేష్ కు జోడిగా ఇలియానా నటించగా, మణిశర్మ సంగీతాన్ని అందించారు. వాస్తవానికి అంతకముందు వరకు మహేష్ బాబు చేసిన సినిమాల్లో చాలావరకు మంచి సక్సెస్ ని అందుకున్నప్పటికీ, ఆయన నుండి ఫ్యాన్స్ ఆశించే సినిమాగా సరైన సమయంలో 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పోకిరి సినిమా, అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 

IHG

అప్పటివరకు అభిమానులతో ప్రిన్స్ అని ముద్దుగా పిలిపించుకునే మహేష్ బాబు, ఆ తరువాత నుండి సూపర్ స్టార్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించారు. సరైన పని, పాట లేకుండా పోకిరిగా తిరిగే ఒక కుర్రాడు, అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడడం, ఆ తరువాత పరిస్థితుల అనుసారం కొన్ని సమస్యలు రావడం, ఆ విధంగా కథ ముందుకు సాగడం జరుగుతుంది. ఇక చివర్లో పోకిరిగా తిరిగే హీరోనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటూ వచ్చే ట్విస్ట్, థియేటర్స్ ని దద్దరిల్లేలా చేసింది. ఇకపోతే ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ పెరఫార్మన్స్ తో పాటు ఆయన పలికిన ప్రతి డైలాగ్ కు థియేటర్స్ లో ఫ్యాన్స్, ప్రేక్షకులు విజిల్స్ తో అదరగొట్టారు. 

 

మరీ ముఖ్యంగా ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు అంటూ మహేష్ బాబు, తన మార్క్ మ్యానరిజంతో చెప్పే ఈ డైలాగ్ అయితే అదుర్స్ అని చెప్పాలి. స్వతహాగా తన హీరోలను పక్కా మాస్ గా చూపించే పూరి జగన్నాథ్, ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు రాసిన ప్రతి డైలాగ్ కూడా మరింతగా అదరగొట్టే రేంజ్ లో రాసుకున్నారు అనే చెప్పాలి. అప్పట్లో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా, అలానే ఇందులోని ప్రతి డైలాగ్ ను ఎప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా మరిచిపోలేరు....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: