పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. అంతకముందు హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు అంతకముందు కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న పవన్ కళ్యాణ్ కు అతి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. పవన్ కు ఒక పక్కా మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో, దాని దెబ్బ ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ అప్పట్లో రుచి చూపించింది. 

IHG

వాస్తవానికి పూర్తిగా దబాంగ్ సినిమాని దర్శకుడు హరీష్ శంకర్ దింపేయలేదు. కేవలం సినిమా యొక్క మెయిన్ ప్లాట్ ని మాత్రమే తీసుకుని, దానిని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు, అలానే పవర్ స్టార్ ఇమేజ్ ను మరింతగా పెంచేలా హరీష్ ఈ సినిమా స్క్రిప్ట్ ని రాసుకోవడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో పాటు ఆయన పలికిన పవర్ఫుల్ డైలాగ్స్, థియేటర్స్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులతో కూడా విజిల్స్ కొట్టించాయి. మరీ ముఖ్యంగా నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది అంటూ పవన్ పాలిక డైలాగ్ అదిరిపోయింది. వాస్తవానికి గబ్బర్ సింగ్ పాత్ర యొక్క ఔచిత్యాన్ని తెల్పుతూ, అలానే పవన్ రేంజ్ మాస్ స్టైల్ లో ఉండే ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా యొక్క రేంజ్ ఏంటో చెప్పడానికి.  

 

స్వతహాగా దర్శకుడు హరీష్, పవన్ కు వీరాభిమాని కావడంతో ఆయన మీద అభిమానంతో పాటు, ఎలాగైనా పవర్ స్టార్ కు పెద్ద హిట్ ఇవ్వాలనే తలంపుతో ఈ సినిమాను మరింత కసిగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ఈ ఒక్క డైలాగ్ మాత్రమే కాదు, సినిమలో దాదాపుగా పవన్ నోటి వెంట వెలువడే ప్రతి డైలాగ్ కు థియేటర్స్ లో విజిల్స్ మారుమ్రోగాయి. మొత్తంగా ఈ సినిమా వచ్చి దాదాపుగా ఎనిమిదేళ్ళకు పైగా అయినప్పటికీ కూడా, సినిమాలోని ఈ డైలాగ్ యొక్క పవర్ ఇంకా తగ్గలేదని చెప్పాలి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: