టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సినిమా అంటే అందులో ఏదో ఒక ఎలిమెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కథ, కథనాలు ఎలా ఉన్నా పూరి టేకింగ్ మాత్రం దుమ్ముదులిపేస్తుంది. ఎంచుకున్న బడ్జెట్ లో ఫస్ట్ క్లాస్ క్వాలిటీతో సినిమా చేయగల సత్తా పూరికి ఉంది. టెంపర్ తర్వాత హిట్టు కోసం తిప్పలు పడ్డ పూరి ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. అదే జోష్ తో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు పూరి. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. 

 

ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సినిమా చేస్తాడని ఎనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ యువి క్రియేషన్స్ వారు పూరితో ఓ క్రేజీ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ కు ధీటుగా సినిమాలు చేస్తున్న మన వాళ్లు.. వాళ్లకు సరిసమానంగా వెబ్ సీరీస్ లు కూడా చేయాలనే ప్రయత్నంలో ఈమధ్య స్టార్ డైరక్టర్స్ కూడా వెబ్ సీరీస్ ల మీద పడుతున్నారు. ఈ క్రమంలో పూరితో ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారు యువి క్రియేషన్స్. తను అడిగిన బడ్జెట్ ఇచ్చి ఇష్టం వచ్చిన కథ.. తనకు కావాల్స్న కాస్ట్ అండ్ క్రూ తీసుకుని ఈ వెబ్ సీరీస్ చేయమన్నారట.

 

మాములుగా అందరి దర్శకుల కన్నా సినిమాలనే స్పీడ్ గా అనుకున్న టైం కు.. అతి తక్కువ కాలంలో పూర్తి చేసే పూరి వెబ్ సీరీస్ అయితే మడతపెట్టేయడం ఖాయమని అంటున్నారు. మరి పూరి వెబ్ సీరీస్ కథా కమామిషు ఏంటో త్వరలో తెలుతుంది. పూరి మాత్రం తన పూర్తి ఫోకస్ ఫైటర్ మీద పెట్టినట్టు తెలుస్తుండగా ఈ వెబ్ సీరీస్ వార్త అందరి అటెన్షన్ ను ఏర్పరచుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: