మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా హరీశ్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటించింది. అప్పటికే సాయి తేజ్ తో రెజినా జోడీ కట్టిన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈ కాంబో రిపీట్ చేశాడు హరీశ్ శంకర్. ఈ సినిమాలో ఓ పల్లెటూరు అమ్మాయి ఫేస్ బుక్ ఫ్రెండ్ ప్రేమలో పడి అక్కడ అతను మోసం చేయడంతో ఒంటరిది అవుతుంది. అక్కడ హీరో ఆమెను ఆదుకుని ఆశ్రయమిస్తాడు. ఒకానొక సందర్భంలో డబ్బు కోసం వీరు మ్యారేజ్ కపుల్స్ లా కనిపించాల్సి వస్తుంది. అక్కడ వాళ్లకు తెలిసిన వ్యక్తి రావడం నిజంగా ఆమెకు పెళ్లైందని తెలియడం మిగతా సినిమా కథ.

 

సినిమా కొద్దిగా బావగారు బాగున్నారా కథకు దగ్గరగా ఉంటుంది. అయితే సినిమాలో మిగతావి ఎలా ఉన్నా సీతతో అంత ఈజీ కాదు అని రెజినా చెప్పే డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రెజినా ఈ ఒక్క డైలాగ్ మాత్రమే చెబుతుంది. సీతతో అంత ఈజీ కాదు అని గడుసు పిల్లగా ఆమె కనిపిస్తుంది. అయితే ప్రేమించిన వాడు మోసం చేయడంతో నిరాశ్రయురాలిగా ఉన్న హీరోయిన్ కు హీరో సపోర్ట్ గా ఉండటం. మళ్లీ వాళ్లిద్దరు ప్రేమలో పడటం లాంటివి జరుగుతాయి.

 

ఫైనల్ గా మెగా మేనళ్లుడు సాయి తేజ్ తో హరీశ్ శంకర్ కొట్టిన హిట్టు సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. మెగా హీరోలతో హరీష్ శంకర్ సినిమా అంటే అది పక్కా హిట్ అన్నట్టే లెక్క. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ తీసి హిట్టు కొట్టిన హరీశ్ శంకర్ సాయి తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీశాడు. ఇక లాస్ట్ ఇయర్ వరున్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి మెగా హీరోలతో ఈ డైరక్టర్ సినిమా అంటే సూపర్ హిట్ అన్నట్టే లెక్క. 

మరింత సమాచారం తెలుసుకోండి: