‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ తువాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ పైనల్ అయినా ఆ మూవీ ఎప్పుడు మొదలవుతుందో త్రివిక్రమ్ కు కూడ క్లారిటీ లేదు. ఈమూవీ ప్రాజెక్ట్ ‘ఆర్ ఆర్ ఆర్’ తో లింక్ పడి ఉండటంతో ఈసినిమాకు సంబంధించిన టోటల్ స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ పూర్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.


వాస్తవానికి ఈ గ్యాప్ లో ఖాళీగా లేకుండా ఒక మిడిల్ రేంజ్ హీరోతో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావించినా కరోనా సమస్యలతో ఆ ఆలోచనలు ముందుకు సాగలేదు. దీనితో ఈ సంవత్సరం అంతా త్రివిక్రమ్ ఖాళీగా కూర్చో వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈమధ్య రెండు సార్లు త్రివిక్రమ్ రామ్ చరణ్ ను వ్యక్తిగతంగా కలిసాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

 

అంతేకాదు త్రివిక్రమ్ చతాన్ కు రెండు కథలకు సంబంధించి రెండు స్టోరీ లైన్స్ చెప్పాడని ప్రచారం జరుగుతోంది. దీనితో త్రివిక్రమ్ ఈకథలు చరణ్ ను దృష్టిలో పెట్టుకుని చెప్పాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి రామ్ చరణ్ కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ లో చిక్కుకున్న పరిస్థితులలో చరణ్ కు త్రివిక్రమ్ చెప్పిన కథలు నచ్చినా వెంటనే నటించే పరిస్థితి లేదు.

 

దీనితో త్రివిక్రమ్ చరణ్ ల భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీలో పలు ఆశ్చర్యకర చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా త్రివిక్రమ్ ముందుగా కథకు సంబంధించి హీరోలకు లైన్ మాత్రమే చెపుతాడు. ఆ లైన్ నచ్చి హీరో నటించడానికి అంగీకరించినప్పుడు మాత్రమే త్రివిక్రమ్ డెవలప్ చేస్తాడు అని అంటారు. దీనితో త్రివిక్రమ్ తన మనసులో వచ్చిన రెండు కథలను చరణ్ కు చెప్పడానికి మాత్రమే కలిసి ఉంటాడు కానీ ఈ భేటీలో ప్రత్యేకమైనా ప్రాధాన్యత ఏమి లేదు అంటూ త్రివిక్రమ్ సన్నిహితులు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: