టాలీవుడ్ లో తేజ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్.  ఈ మూవీలో చాలా అమాయకంగా కనిపించినా.. తర్వాత తన గ్లామర్ తో అదరగొట్టింది. అప్పట్లో కుర్ర హీరోలందరి సరసన నటించడమే కాదు.. స్టార్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాన్ సరసన కూడా నటించింది.  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన టాప్ హీరోలందరి సరసన నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు.  గత ఏడాది సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కానీ అది ఫెయిల్ అయ్యింది.  ఈ అమ్మడు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తుంది.  

 

మూవీ ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులతో ముందుకు సాగుతు వస్తుంది. ఈ భామ పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తన చెల్లెలు నిషా అగర్వాల్‌ పెళ్లి చేసుకోవడంతో..అమ్మానాన్న తనను కూడా పెళ్లి చేసుకోవాలంటున్నారని, అయితే తాను ఇంకా జీవితంలో స్థిరపడాల్సి ఉందని గతంలో ఇంటర్వ్యూలో కాజల్‌ చెప్పింది. ఇపుడు పెళ్లి వార్తలు మరోసారి షికారు చేస్తున్నాయి. తల్లిదండ్రులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

 

 

కాజల్‌ కు కాబోయే వరుడు ఇండస్ట్రీ వ్యక్తి కాకుండా వ్యాపారవేత్త అయి ఉంటాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. కాజల్‌ ప్రస్తుతం ఇండియన్‌ 2, చిరంజీవితో ఆచార్య, మంచు విష్ణుతో కలిసి మోసగాళ్లు చిత్రాల్లో నటిస్తుంది. మరి ఈ ప్రాజెక్టులు అయిపోయిన తరువాత పెళ్లికి సంబంధించిన వార్తలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. తాను పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉన్నానని ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.  మొత్తానికి పెళ్లి వార్తలు అనగానే తనదైన స్టైల్లో సమాధానం ఇస్తూ వస్తుంది ఈ కలువ కళ్ల సుందరి కాజల్.

మరింత సమాచారం తెలుసుకోండి: