2018లో 'దఢక్'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది  శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఈసినిమా 100కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఈచిత్రం తరువాత జాన్వీ, గుంజన్ సక్సేనా అనే బయోపిక్ లో నటించింది. భారత మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా  తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ, గుంజన్ పాత్రలో కనిపించనుంది.
 
ఇక ఈచిత్రాన్ని హిందీ తోపాటు ,తెలుగు ,తమిళ భాషల్లో ఏప్రిల్ లోనే విడుదల చేద్దాం అనుకున్నారు కానీ  కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితిలేదు కాబట్టి గుంజన్ సక్సేనాను  డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి  మేకర్స్ సిద్ధపడ్డారు. ఈసినిమా డిజిటల్ హక్కులను  నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ 70కోట్ల వరకు  చెల్లించిందని బాలీవుడ్ మీడియా  వర్గాలు అంటున్నాయి. సినిమా బడ్జెట్ 30కోట్లు కాగా ఇప్పుడు  దానికి రెండంతలు రావడంతో  నిర్మాతలకు భారీగా  లాభాలు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రాన్ని శరన్ శర్మ తెరకెక్కించాడు.  
 
ఇక ఈసినిమా కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానున్నాయి. అందులో  విద్యాబాలన్ నటించిన శంకుతలా దేవి , అమేజాన్ ప్రైమ్ లో విడుదలకానుండగా దివంగత యంగ్ హీరో  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా దిల్ బెచార జులై 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలకానుంది. వీటితోపాటు లక్ష్మి బాంబ్, బుర్జ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: