సిని పరిశ్రమలో సుశాంత్ సింగ్ మరణం అందరిని అతలాకుతలం చేస్తుంది. అతని మరణం అనంతరం తరువాత వారసత్వం నుంచి వచ్చిన స్టార్స్ పై నెగిటివ్ కామెంట్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయన్నా సంగతి తెలిసిందే. గతంలో కూడా నెపొటిజం పై కామెంట్స్ వచ్చినప్పటికీ ఈ స్థాయిలో అయితే వైరల్ కాలేదన్నారు. ఎదో ఒక విదంగా న్యూ టాలెంట్ ని సపోర్ట్ చేయాలని కొందరు ట్రై చేస్తున్నారు.

 

 

సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు. కానీ సొంతంగా ఎదిగేవారిని స్టార్ హీరోలు తొక్కేయడానికి చాల మంది ట్రై చేస్తుంటారనే నెగిటివ్ కామెంట్ కి కౌంటర్స్ ఇచ్చేలా మహేష్ అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోందన్నారు. ముందుగా మహేష్ కొంత మంది కుర్ర హీరోలతో సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నాడని తెలిపారు.

 

 

ఇప్పటికే మహేష్ తన జీఎంబి ప్రొడక్షన్ లో అడివి శేష్ తో ఒక సినిమాను స్టార్ట్ చేశారు. 26/11 ముంబై ఎటాక్స్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలిపారు. అదే ప్రొడక్షన్ లో మరికొంత మంది హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడని తెలిపారు.

 

 

యువ హీరో శర్వానంద్ కోసం ఒక లవ్ స్టోరీని సెట్ చేసినట్లు తెలుస్తోందన్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చిన హీరోల్లో శర్వానంద్ ఒకడు. శర్వానంద్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చేలా మహేష్ ఒక సినిమాను ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడని తెలిపారు. దాదాపు స్క్రిప్ట్ పనులని పూర్తయినట్లు తెలుస్తోందన్నారు.

 

 

విజయ్ దేవరకొండతో కూడా ఒక సినిమా చేయాలని మహేష్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడని తెలిపారు. విజయ్ అంటే మహేష్ బాబుకు చాలా ఇష్టం. సొంతంగా పైకొచ్చిన హీరో అంటూ గతంలోనే చాలా సార్లు పొగిడిన విషయం అందరికి తెలిసిందే. అలాంటి హీరోతో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలని సరైన స్క్రిప్ట్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. మరి మహేష్ కి ఈ ప్లాన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: