పవన్ సినిమా వస్తుంది అంటే చాలు ఫాన్స్ కి పండగ. ఆయన సినిమా కోసం ఎదురు చూడని వారు ఉండరు. సినిమా కోసం  ప్రతీ ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంది.  ఇక దర్శక నిర్మాతలు ఇప్పుడు పవన్ ఖాళీ గా ఉంటే సినిమాలు చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. రెండు మూడేళ్ళు పవన్ వరుసగా సినిమాలను ప్లాన్ చేసాడు. రెండు మూడేళ్ళు కూడా  అతను సినిమాలను లైన్ లో పెట్టడం తో ఇప్పుడు ఆయన కోసం పోటీ పడే వారు కాస్త వెనక్కు తగ్గారు. ఇప్పుడు వేణు శ్రీరాం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నారు. 

 

వకీల్ సాబ్ అనే రీమేక్ సినిమాలో ఆయన చేస్తూ ఉండగా ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. కరోనా కంటే ముందే ఆపేసినా ఆ తర్వాత మొదలు పెట్టే అవకాశం లేక మొదలు పెట్టలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేయడానికి మంచి డేట్ ని కూడా చూస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి ఈ ఏడాది సినిమాలు ఏమీ విడుదల అయ్యే అవకాశం లేదు. స్టార్ హీరోల సినిమాలు ఏవీ కూడా ఇప్పుడు సంక్రాంతి బరిలో లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాను అప్పుడు విడుదల చేస్తే మంచిది అని భావిస్తున్నారట దర్శకుడు దిల్ రాజు. 

 

అందుకే ఇప్పుడు ఈ సినిమా గురించి ఏ ప్రకటన చేయడం లేదు అని అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత సినిమాను మొదలు పెట్టాలి అని చూసినా సరే కరోనా దెబ్బకు వద్దు అని భావించారట. వచ్చే ఏడాది ఈ సినిమాను సంక్రాంతికి ఎలా అయినా సరే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఎప్పుడు లైన్ లో పెడతారు ఏంటీ అనేది చూడాలి అంటే ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: