కరోనా వల్ల సినిమాల రిలీజ్ డేట్లు తారుమారవుతున్నాయి. ముందుగా షెడ్యూల్ ప్రకారం  షూటింగ్ పూర్తి చేసి పలానా టైంకు విడుదలచేయాలని నిర్మాతలు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు కానీ కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది. విడుదలకు సిద్ధంగా వున్న సినిమాల్లో కొన్ని ఓటిటి లపై చూస్తుండగా మరికొన్ని  థియేటర్ల రీ ఓపెన్ కోసం ఎదురుచూస్తున్నాయి అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఆక్టోబర్ వరకు థియేటర్లు ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు.కరోనాకు వాక్సిన్ వస్తే  కానీ జనాల్లో దైర్యం రాదు ఆ వాక్సిన్  ఎప్పుడొస్తుందో కూడా  చెప్పలేని పరిస్థితి.  
 
థియేటర్ల వరకు ఎందుకు ప్రభుత్వం షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చినా షూటింగ్ ప్రారంభించే సాహసం చేయలేకపోతున్నారు. కొత్త సినిమాల షూటింగ్ లు లేకుండా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోని వున్న సినిమాలు షూటింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అయినా కూడా షూటింగ్ లు స్టార్ట్ కాలేదు అందులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ఒకటి. ఇప్పటివరకు సగానికి పైగా షూటింగ్ పూర్తి కాగా మరో 20రోజుల షెడ్యూల్ బ్యాలన్స్ వుంది. 
 
ముందుగా ఈచిత్రానికి మేలో విడుదలచేయాలనుకున్నారు కానీ అది కుదరకపోవడంతో ఎలాగైనా దసరాకు  తీసుకురావాలనుకున్నారు కానీ ఆ సమయానికి షూటింగ్ కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు దాంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారట. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో పవన్ లాయర్ గా నటిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: