మన తెలుగు లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ మీరా జాస్మిన్. ఆమెకు కథల మీద మంచి పట్టు ఉండటం తో సినిమాలను చాలా జాగ్రత్తగా ఆమె ఓకే చేస్తూ వచ్చింది అనే సంగతి తెలిసిందే. అగ్ర హీరోల తో సినిమాలు చేసినా చిన్న హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె మాత్రం ఏ విధంగా కూడా వెనక్కు తగ్గకుండా చాలా భారీగా డిమాండ్ చేసేది అనే పేరు కూడా ఉండేది. ఇక ఆమె ఆ తర్వాత స్కిన్ షో చేయలేక టాలీవుడ్ నుంచి పక్కకు వెళ్ళింది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆమె టాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 

 

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆమె ఒక పాత్ర పోషించే అవాకాశం ఉంది. మాజీ హీరోయిన్ లకు తన సినిమాలో త్రివిక్రమ్ అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఆమెకు కూడా అవకాశం ఇచ్చాడు అని సమాచారం. ఆమె ఇప్పుడు రెండు సినిమాలను తెలుగు లో ఓకే చేయగా ఒకటి ఎన్టీఆర్ తో చేసే సినిమా అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమా కోసం ఆమె 3౦ లక్షల వరకు తీసుకుంటుంది అని సమాచారం. మరి నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా రెడీ గా లేదు గాని వచ్చే ఏడాది రెడీ అవుతాయి అని సమాచారం. 

 

ఇక ఆమె రామ్ చరణ్ సినిమాలో కూడా నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. చేస్తుందా లేదా అనేది చూడాలి. మాజీ హీరోయిన్ లకు ఎప్పుడు మంచి పాత్రలు ఇచ్చే త్రివిక్రమ్ ఇప్పుడు ఆమెకు ఏ విధమైన పాత్ర ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: