భారత దేశ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన షారుక్ ఖాన్ కుర్ర హీరోలందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పుకోవచ్చు. నేటికీ షారుక్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 28 సంవత్సరాలు కావస్తుంది. ఈ 28 సంవత్సరాలలో తాను ఎంతో కష్టపడి ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు ప్రసాదించాడు. అతనికి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా మహాసముద్రం వంటి బాలీవుడ్ పరిశ్రమలో నిలదొక్కొకొని ఉత్తమ నటుడిగా పేరు పొందాడు. ప్రస్తుతం అతను బాలీవుడ్ పరిశ్రమలో ఎక్కువ సంపద కలిగి ఉన్న హీరో. ఆ సంపద మొత్తం తాను ఒంటి చేత్తో సంపాదించడం విశేషం. 


బాలీవుడ్ పరిశ్రమలో గాడ్ ఫాదర్ గా పేరొందిన షారుక్ ఖాన్  ఎంతో మంది హీరోయిన్లకు సినీ జీవితాన్ని ప్రసాదించాడు. దివానా(1992) సినిమాలో మొట్టమొదటిగా నటించిన షారుక్ ఖాన్ తనలోని నటనా చాతుర్యాన్ని ప్రేక్షకులకు చూపించి ఫిదా చేసేసాడు. మొట్టమొదటి సినిమాతోనే ఎన్నో అవార్డులను గెలుచుకున్న షారుక్ ఖాన్ ని చూసి బాలీవుడ్ పరిశ్రమ అంతా అవాక్కయింది. 1993- 94 సంవత్సరాల మధ్యలో షారుక్ ఖాన్ బాజిగర్, డార్,  కబీ హాన్ కబీ నా, అంజమ్, కరణ్ అర్జున్ సినిమాల్లో నటించగా అవన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. 


డార్ సినిమాలో కథానాయకుడి పాత్రలో నటించడానికి ఏ బాలీవుడ్ హీరో సాహసించలేదు కానీ షారుక్ ఖాన్ మాత్రం ఆ పాత్రలో అవలీలగా నటించి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. తాను తీసిన దిల్వాలే దుల్హనియా లేజాయింగే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రోజుల పాటు ఆడి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేయక ముందు రోజు వరకు ఈ సినిమా థియేటర్లలో ఆడుతూనే ఉందంటే అతిశయోక్తి కాదు. 


1997 సంవత్సరం లోపు అనగా షారుక్ ఖాన్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అయిదు సంవత్సరాల లోనే అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ తో కలిసి కుచ్ కుచ్ హోతాహై, కభి ఖుషి కబీ గం చిత్రాల్లో నటించి ప్రేక్షకులను చూరగొన్నాడు. షారుక్ నటుడిగా మాత్రమే కాదు ప్లేబ్యాక్ సింగర్ గా కూడా  అవతారమెత్తి ప్రేక్షకులను బాగా అలరించారు. 1999వ సంవత్సరంలో షారుక్ ఖాన్ బాద్షా సినిమాలో హీరోగా నటించిన తర్వాత అతనికి బాద్షా అనే బిరుదు వచ్చింది. ఆ సినిమా తర్వాత నుండి అతడిని అందరూ బాలీవుడ్ బాద్షా అని పిలవడం ప్రారంభించారు. 


28 సంవత్సరాల సినీ కెరీర్ లో తాను కాజోల్, మాధురి దీక్షిత్, ప్రీతిజింతా, ఐశ్వర్య రాయ్, సుస్మితాసేన్ వంటి అగ్రతారల తో రొమాన్స్ చేసి ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుత స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, కత్రినా కైఫ్ కరీనా కపూర్ వంటి హీరోయిన్ల తో కూడా జతకట్టి ప్రేక్షకులకి కనులవిందు చేశాడు. ఓం శాంతి ఓం సినిమాలో దీపికా పడుకొనే తో, రబ్ నే బనాదీ జోడీ సినిమాలో అనుష్క శర్మ తో, రా. వన్ సినిమాలో కరీనా కపూర్ తో జత కట్టిన షారుక్ ఖాన్ నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల హీరోయిన్ల యవ్వనానికి, ఫిట్నెస్ కి పోటీ ఇచ్చాడంటే అతిశయోక్తి కాదు. జీరో సినిమాలో మరుగుజ్జు పాత్రలో నటించి తాను ఎటువంటి పాత్రలోనైనా ఒదిగి పోవాగలనని చెప్పకనే చెప్పేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: