ఇప్పుడు టాలీవుడ్ లో భిన్నమైన కథలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కథ బాగుంది అనుకుంటే చాలు దర్శక నిర్మాతలు అందరూ కూడా చాలా ఆసక్తిగా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు నితిన్ వరుస విజయాలతో దూసుకుపోతూ కథల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతను ప్రతీ సినిమాను కూడా చాలా జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచన చేసి చేస్తున్నాడు. ఈ తరుణంలో అతని గురించి ఒక వార్త వచ్చింది. 

 

అతను ఒక అమ్మాయి జీవిత కథ ఆధారంగా సినిమా చేయడానికి గానూ ముందుకు వచ్చాడు అని సమాచారం. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా చేయడానికి గానూ రెడీ అయ్యాడు అని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అతను ఒక ప్రకటన చేసి కథను రెడీ చేసే అవకాశం ఉందని దానికి టైటిల్ కూడా కొత్తగా పెట్టే ఆలోచనలో ఉన్నాడు అని అంటున్నారు. నాగలక్ష్మి అనే టైటిల్ తో అతను ఒక సినిమాను చేయడానికి రెడీ అయ్యడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై అతని నుంచి త్వరలోనే ఒక ప్రకటన రావడం ఖాయమని అంటున్నారు. 

 

ఈ సినిమాకు సంబంధించి అతను ఇప్పటికే ఒక ప్లాన్ ని కూడా రెడీ చేసాడు అని తెలుస్తుంది. ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే వకాశం ఉంది అని సమాచారం. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అనేది చూడాలి. ఈ సినిమాలో నితిన్ కూడా కనపడే అవకాశం ఉందని అతను లాయర్ పాత్రలో నటించే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు మరి. నిజం ఎంత అనేది చూడాలి అంటే కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే. ఇప్పుడు అతను పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: