సినిమా ఇండస్ట్రీని అద్దాల మేడతో పోలుస్తారు. కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా.. ఎక్కువ ఎఫెక్ట్ అయింది మాత్రం సినిమా వాళ్లే. లాక్ డౌన్ ఎత్తివేసినా తర్వాత కొంతైనా జీవనం సాధారణ స్థాయికి వస్తే.. సినిమా వాళ్ల పరిస్థితి ఏమాత్రం కుదుటపడలేదు. ఈ కరోనా టైమ్ లో కూడా కొద్దోగొప్పో అదృష్టవంతులు ఎవరంటే.. ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. 

 

2020 మొదలై అప్పుడే.. సగం పూర్తయిపోతోంది. ఈ ఫస్ట్ హాఫ్ లో సగం రోజులు కరోనాతోనే గడిచిపోయాయి. సినిమాకు మెయిన్ సీజన్ అయిన సమ్మర్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇప్పట్లో థియేటర్స్ తెలుస్తారన్న నమ్మకం కూడా లేదు. థియేర్స్ ఉంటాయని.. వాటిలో సినిమా చూడాలన్న సంగతి మరిచిపోయేలా కరోనా దెబ్బకొట్టింది. 

 

ఈ ఏడాది సినిమా సీజన్ సంక్రాంతితోనే ముగిసింది. ఈ పండగకు పెద్ద హీరోలు మహేశ్, బన్నీ.. సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంపురంతో పోటీపడ్డారు. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద 100కోట్లు మార్క్ దాటేసి ఘన విజయం సాధించాయి. అల వైకుంఠపురములో అయితే.. 150కోట్ల క్లబ్ లో చేరింది. కరోనాకు ముందు వచ్చిన బన్నీ.. మహేశ్ సినిమాలు తప్ప ఈ ఏడాది చెప్పుకునే సినిమా మరొకటి రాలేదు. 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కరోనా దోబూచులాడుతోంది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాకు బై చెప్పేసిన పవ్ ఏడాదిన్నర విరామం తర్వాత వకీల్ సాబ్ తో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. మే 15న అదిరిపోయేలా రీ ఎంట్రీ ఇద్దామనుకుంటే.. వకీల్ సాబ్ ను కరోనా అడ్డుకుంది. ఇంకా 35రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆగస్ట్ లో షూటింగ్ మొదలైతే.. ఈ ఏడాది బన్నీ.. మహేశ్ తర్వాత వచ్చే మూడో స్టార్ హీరో పవన్ అవుతాడు.  

 

ఈ ఏడాది మొదట్లో మెరిసిన మహేశ్.. బన్నీ ఇంకో ఏడాది కనిపించకపోయినా.. పెద్దగా పట్టింపు ఉండదు. బన్నీకి పుష్ప.. మహేశ్ కు సర్కార్ వారి పాట చేతిలో ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టి.. ఏడాది తిరగకుండా వస్తారు. ఎటొచ్చీ ఎక్కువ నష్టపోయింది ఎన్టీఆర్, రామ్ చరణే. 

మరింత సమాచారం తెలుసుకోండి: