ఓటీటీ. ఇదిపుడు నిర్మాతలకు ఒక వరంగా  మారుతోంది. నిన్నటిదాకా ఓటీటీ అంటే చిన్న చూపు చూసిన వారు సైతం ఇపుడు ఇదే శరణ్యమని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే లాక్ డౌన్ శతదినోత్సవం చేసుకుంది. మరో శత‌దినోత్సవానికి రెడీగా ఉంది. ఈ టైంలో చేతిలో ఉన్న సినిమాలను విడుదల చేసుకోకపోతే ఇక వాటి మీద దుమ్ము రేగుతూపోవడం ఖాయమన్న ఆలోచనకు నిర్మాతలు వచ్చేశారు.

IHG

థియేటర్లోనే సినిమా రిలీజ్ చేస్తాం, మాకు పెద్ద తెర ముందు, మా సత్తాను ఓటీటీ ఎలా తట్టుకుంటుంది అంటూ రాగాలూ దీర్ఘాలూ తీసిన బడా నిర్మాతలు సైతం వచ్చిన కాడికి ఇక్కడే సినిమాను అమ్ముకోవాలనుకోవడం కరోనా తెచ్చిన కఠినమైన మార్పుగా చూడాలి.

IHG

ఇదిలా ఉండగా ఓటీటీ పైన ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ కూడా మనసు పడి ఇంతకంటే ఇప్పటికి మార్గం లేదని సినిమాలు వరసగా రిలీజ్ చేసేశాయి. తమిళ నాట సూపర్ స్టార్ డం ఉన్న విశాల్ వంటి హీరోలు కూడా తమ సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసుకుంటున్నారు.

IHG

తెలుగులో క్రిష్ణ అండ్ హిజ్ లీల ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన తొలి సినిమా అంటున్నారు. ఈ సినిమా నిర్మాణం వెనక దగ్గుబాటి రానా ఉన్నాని అంటున్నారంటే బడా నిర్మాతలు ఇటువైపు చూస్తున్నారనే అనుకోవాలి. ఇక ఇదే వరసలో మరిన్ని కొత్త సినిమాలు తెలుగులో వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. వీటిని ఓటీటీ ద్వారా చూసి తరించడమే ఇపుడు అందరికీ మిగిలింది.

IHG's Penguin gets an OTT release date! | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> ...

ఈ కరోనా కష్టాలు, లాక్ డౌన్ అన్నది ఈ ఏడాది అంతం వరకూ ఉంటుందని ఒక అంచనా. అది కూడా ఎవరూ చెప్పలేరు. కరోనా మహమ్మారికి ఆ టైంకి వాక్సిన్ వస్తుందని భావిస్తున్నారు. లేదా కరోనా బాధలు కూడా తగ్గుతాయని ఇప్పటికి అంచనా వేసుకుంటున్నారు. అది జరిగేంతవరకూ థియేటర్లను నమ్ముకోకుండా ఓటీటీల వైపే చూడాలన్నది నిర్మాతల ఆలోచనగా ఉంది. మరి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: