ఏ సినిమా? ఏ హీరోయిన్ ? టైటిల్ లోనే పేరు చెప్పచ్చు కదా అని అనుకుంటున్నారా? అదేలేండి.. హ్యాపీ డేస్ సినిమా చూశారు కదా! ఆ సినిమాలో సోని ఉంది కదా! ఆ సినిమాలో సోని మాట్లాడితేనే ఎంతో క్యూట్ గా ఉంటాయి ఆ మాటలు. అలాంటి క్యూట్ క్యూట్ మాటలలో ఒక డైలాగ్ మాత్రం భలే క్యూట్ గా ఉంటుంది. 

 

IHG

 

నిజం చెప్పాలి అంటే హ్యాపీ డేస్ లో అన్ని క్యారెక్టర్లు అందంగా ఉంటాయి. కామెడీగా.. పొసెసివ్ గా.. అల్లరి అల్లరిగా క్యారెక్టర్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇంకా అలాంటి ఈ సినిమాలో సీనియర్ స్రవంతి క్యారెక్టర్ పోషించిన సోని ఇంకా బాగుంటుంది. జూనియర్ టైసన్ సోనికి లవ్ చెయ్యడం.. ప్రేపోజ్ చెయ్యడం చాలా బాగుంటుంది. 

 

IHG

 

అలాంటి టైసన్ ఇంకా సోనీ ని కోషన్స్ వెయ్యడం.. అప్పుడు సోని పిల్లా 'జూనియర్స్ సీనియర్స్ ని కోషన్స్ వెయ్యకూడదు' అని అనడం చాలా క్యూట్ గా ఉంటుంది. ఇంకా అంతే.. అప్పట్లో ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు డైలాగులు వెయ్యడం అబ్బో.. ఎవరైనా జూనియర్ కోషన్ వేస్తే చాలు జూనియర్స్ సీనియర్స్ ని కోషన్స్ వెయ్యకూడదు అంటూ డైలాగ్ కొట్టేవాళ్ళు. 

 

IHG

 

ఈ ఒక్క డైలాగ్ తో ఇండస్ట్రీలో ఓ మంచి పేరు తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అబ్బో ఆ నల్ల పిల్ల వేసిన డైలాగ్ భలే ఉంది అని అనేవారు. నల్ల పిల్ల అని ఎందుకు అనేవాళ్ళు అంటే అందరికి ఈమె పేరు తెలియదు.. అప్పట్లో కనుక్కొనే అవకాశం కూడా లేదు.. అందుకే నల్ల పిల్ల అని అనేవారు. ఈ సీనియర్ డైలాగ్ తో నే అందరికి నచ్చేసింది ఈ సోని పాప. 

మరింత సమాచారం తెలుసుకోండి: