ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కోట్లు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో నిర్మించిన సినిమాలన్ని ల్యాబ్ లోనే మూలుగుతున్నాయి. అయినా మేకర్స్ మాత్రం ఎంత ఆలస్యం అయినా థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని పట్టుదలగా ఉన్నారు. కొన్ని సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశ్యం లేదని నిర్మాతలు తేగేసి చెబుతున్నారు. కోన వెంకట్ నిర్మించిన అనుష్క నిశబ్ధం తో పాటు తెలుగులో దిల్ రాజు నిర్మించిన నాని వి, రాం రెడ్ .. ఇలా చాలా సినిమాలున్నాయి. కాని గాసిప్స్ మాత్రం బాగా రెచ్చిపోతున్నారు. ఆ సినిమా ఓటీటీలో వచ్చేస్తుంది...ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారట అంటూ జనాలను ఊదరగొడుతున్నారు. 

 

ఇలాంటి వార్తలు ఒక బయోపిక్ గురించి వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా నిర్మాతలు తేల్చి చెప్పారు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బయోపిక్ 83. ఇండియా జట్టుకు సారథ్యం వహించిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ సినిమా రూపొందుతుంది. రణ్ వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ఈ బయోపిక్ ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తునాడు. కపిల్ భార్య పాత్రలో రణ్ వీర్ సింగ్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తోంది. ఇక ఈ సినిమాని హిందీ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.

 

ఈ నేపథ్యంలో సౌత్ లో రిలీజ్ కి రెడీగా కొన్ని సినిమాలని ఓటిటీలో రిలీజ్ చేయడానికి ఆయా సినిమాల మేకర్స్ సిద్దమవుతున్నారు. అమితాబ్, అక్షయ్ కుమార్ ల సినిమాలు కూడా అందుకు సిద్దమవుతున్నాయి. దాంతో 83 ని కూడా ఓటిటీలో రిలీజ్ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే అవన్ని కేవలం గాసిప్స్ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆగష్టు లో ఈ సినిమాని డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మీద నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అందుకు కారణం ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. కాని ఈ సినిమా ఆగస్టు లో రిలీజవుతుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద డైలమాగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: