ఏంటి ? లావణ్య త్రిపాఠికి కూడా పెళ్లినా? నిన్ననే కథ కాజల్ అగర్వాల్ పెళ్లి అన్నారు.. ఇప్పుడు ఏంటి ? లావణ్య అంటున్నారు? అదేంటి లాక్ డౌన్ లో ఏమి తోచకా ఇలా అందరూ హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారా? అని మీరు అనుకుంటున్నారా? హా మీరు ఏం భయపడకండి.. లావణ్య త్రిపాఠీ పెళ్లి ఏం జరగడం లేదు. 

 

IHG

 

లావణ్య త్రిపాఠి మొదటి సినిమాలో ఓ డైలాగ్ చెప్పింది.. గుర్తుందా? అదేనండి.. ఓ అబ్బాయి చాలా టార్చర్ చేస్తుంటే ఆ టార్చర్ తట్టుకోలేకా వాళ్ళ నాన్నను పెళ్లి చెయ్యమని అడిగేస్తుంది.. ఇంకా ఆ డైలాగ్ ఎంత క్యూట్ గా చెప్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ''నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న'' అంటూ ఎంతో క్యూట్ గా చెప్పింది ఆ డైలాగ్. 

 

IHG

 

ఈ ఒక్క డైలాగ్ ని ఆడపిల్లలు అందరూ టిక్ టాక్ లు, డబ్ స్మాష్ లు చెయ్యడమే సరిపోతుంది. ఆ డబ్ స్మాష్ లు చూసి అందరూ వావ్ అని అంటారు. అంత బాగుంటాయి ఆ డైలాగులు. ఇంకా ప్రతి అమ్మాయి ఆ డైలాగ్ చెప్తూనే ఉంటారు. అప్పట్లో కూడా ఈ ఒక్క డైలాగ్ తో లావణ్య త్రిపాఠీ కి మంచి ఫెమ్ వచ్చింది. మంచి పాపులారిటీని సంపాదించుకుంది. 

 

IHG

 

అయితే ఆ డైలాగ్ తో పాపులారిటీ సొంతం అయినప్పటికీ ఆమెకు సక్సెస్ రేట్ చాలా తక్కువ. తీసిన పది సినిమాలలో రెండో మూడు సినిమాలు హిట్ అయ్యాయి. సినిమాలు సక్సెస్ అవ్వకపోయిన మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మరి ఈ హీరోయిన్ కి భవిష్యత్తులో హిట్ అవుతాయో.. లేదా డైలాగ్ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: